• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /PRC కమిషన్ గడువు పొడిగింపు దిశగా సర్కార్ అడుగులు.. నేడో రేపో క్లారిటీ..!!

PRC కమిషన్ గడువు పొడిగింపు దిశగా సర్కార్ అడుగులు.. నేడో రేపో క్లారిటీ..!!

PRC Commission: తెలంగాణలో 2వ పీఆర్సీ కమిషన్ గడువును మరింత పొడిగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 06, 2026, 09:47 AM IST|Updated: Oct 06, 2026, 09:48 AM IST
joinshare
PRC కమిషన్ గడువు పొడిగింపు దిశగా సర్కార్ అడుగులు.. నేడో రేపో క్లారిటీ..!!
Image Credit: PRC Commission

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

2

చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!

3

వపర్‌ఫుల్‌ నవపంచమి రాజయోగ ఎఫెక్ట్‌.. ఈ రాశుల వారికి కోరికలు నెరవేరి, పనుల్లో విజయాలే!

4

Nizamabad: భీమ్ గల్ పోలీసు స్టేషన్ లో నిప్పుపెట్టుకున్న వ్యక్తి మృతి.. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తత.!.

5

అక్టోబర్ 17న త్రిగ్రహ రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, బంపర్‌ జాక్‌ఫాట్‌!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PRC Commission: తెలంగాణలో 2వ పీఆర్సీ కమిషన్ గడువును మరింత పొడిగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతనెలా ఆఖరుతోనే పీఆర్సీ కమిషన్ కాలపరిమితి ముగిసింది. అయినప్పటికీ.. రిపోర్టు అందకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ఇప్పటికే ఈ ఏడాది మార్చి 29వ తేదీన కమిటీ గడువును పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో త్వరలోనే వరుసగా ఎన్నికల నోటిఫికేషన్లు రానున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడినట్లయితే.. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో పీఆర్సీ రిపోర్టు అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన రెండో వేతన సవరణ అమలుపై తీవ్ర నిరీక్షణ కొనసాగుతోంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయినప్పటికీ 2023 జులై 1వ తేదీ నుంచి వర్తించాల్సిన రెండవ పీఆర్సీ గత 39 నెలలుగా పెండింగ్ లోనే ఉంది. గత ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ నేత్రుత్వంలో ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ కాలపరిమితి గత మార్చి31తోనే ముగిసింది. అప్పటి నుంచి పీఆర్సీ రిపోర్టును దశలవారీగా పొడిగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆ పొడిగింపు గడువు కూడా సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసింది. సుదీర్ఘ కాలంగా పీఆర్సీ అమలుకు నోచుకోకపోవడంతో.. ఉద్యోగ వర్గాల్లో మరింత ఆందోళన పెరిగింది.

అయితే రాష్ట్రంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పీఆర్సీ అమలు అనేది కొంతకాలం వాయిదా వేయడమే మంచిదని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న 5 డీఏలలో 2 డీఏలకు ఈమధ్యే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అలాగే 2004 కంటే ముందు నియమితులైన వారికి ఓల్డ్ పెన్షన్ విధానం పునరుద్ధరణ.. సీపీఎస్ రద్దు వంటి అంశాలపై ప్రత్యేక కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఆ ప్రక్రియా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి పీఆర్సీ కమిషన్ గడువును మరోసారి పెంచి.. ఆ తర్వాత రిపోర్టును నిలకడగా పరిశీలించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని కోణాల్లోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాతే ఫిట్మెంట్ పర్సంటెజ్ పై ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది. 

ఇక రాష్ట్రంలో రాబోయే వరుస ఎన్నికలు పీఆర్సీ ప్రక్రియపై ప్రభావం చూపుతున్నాయి. డిసెంబర్ లోపు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండగా.. వచ్చే ఏడాది మార్చిలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు (హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-నల్లగొండ-వరంగల్) ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ రెండు ఎన్నికల్లోనూ ఉద్యోగులు, పట్టభద్రుల పాత్ర అత్యంత కీలకమని చెప్పాలి. ఎన్నికల కోడ్ కారణంగా పీఆర్సీ ప్రక్రియకు అడ్డంకులు ఎదురవుతాయని.. కోడ్ ముగిసిన తర్వాతే దీనిపై ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగులు కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తారని సర్కారు భావిస్తోంది. ఈ లోగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి నెల రూ.1,500 కోట్లకు పైగా బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇప్పటికే ఫిట్‌మెంట్‌తో పాటు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పీఆర్సీ కమిషన్ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, రెండో పీఆర్సీ ప్రక్రియ ముగిసిన వెంటనే ఉద్యోగుల్లో నిరాశ ఆవహించకుండా ఉండేందుకు వెంటనే మూడో పీఆర్సీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తదుపరి అసెంబ్లీ ఎన్నికల నాటికి (2028 డిసెంబర్ లోపు) మూడో పీఆర్సీ నివేదిక ఇచ్చేలా గడువు విధించే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సీనియర్ ఐఏఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Employees
DA Hike