Hyderabad: డ్రీమ్ గర్ల్ అంటూ లేడీ టీచర్‌కు వేధింపులు... హైదరాబాద్‌లో బైటపడ్డ ప్రిన్సిపాల్ బాగోతం.!.
Female teacher molested in Hyderabad: ప్రతిరోజు స్కూల్ లో ప్రిన్సిపాల్ వేధిస్తుండటంతో టీచర్ స్కూల్ కు వెళ్లడం మానేసింది. ఇంట్లోని వారు ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది.సురారం పరిధిలోని ప్రైవేటు స్కూల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Private school principal Harassed female teacher in suraram Hyderabad: సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువులు ముఖ్యమని చాలా మంది ప్రత్యేకంగా గౌరవించుకుంటారు. అందుకే చాలా మంది కన్నవాళ్లు తమ పిల్లలను మంచి స్కూళ్లలో జాయిన్ చేస్తారు. పిల్లలకు మంచి విద్యాబోధన అందించాలనికోరుకుంటారు. అదే విధంగా చాలా మంది ఉపాధ్యాయులు తమ వృత్తిని దైవంలా భావిస్తారు.
కానీ కొంత మంది తులసీ వనంలో గంజాయి మొక్కల్లా దాపురించారు. వీరు తోటి మహిళ ఉపాధ్యాయులను, విద్యార్థినులు కూడా వేధింపులకు గురిచేస్తారు. ఇలాంటి వారు తమ వృత్తికే మాయనిమచ్చగా మిగిలిపోతారు. తప్పతాగి క్లాసులకు రావడం, తమ పనులను విద్యార్థులతో చేయించుకొవడం చేస్తారు. ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం. తాజాగా.. ఈ కోవకు చెందిన ఒక ఘటన హైదరాబాద్ లోని సురారంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ లోని సురారంలో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్లో ప్రిన్సిపాల్ తోటి మహిళ టీచర్ ను వేధింపులకు గురిచేశాడు.ప్రతిరోజు ఏదో వంకతో ఆమెను మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. అతని నుంచి లేడీ టీచర్ తరచుగా తప్పించుకునేది. కానీ ప్రిన్సిపాల్ మాత్రంతన వంకర బుద్దిని మార్చుుకోలేదు. తరచుగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు.
ఆ కామాంధుడు తన ఫోన్ లో లేడీ టీచర్ పేరును డ్రీమ్ గర్ల్ అని పెట్టుకుని మరీ రోజు లైంగికంగా వేధించేవాడు. ఇటీవల ఈ వేధింపులు కాస్త మరీ హద్దులుదాటి పోవడంతో లేడీ టీచర్ స్కూల్ మానేసింది. ఇంట్లోని వారు ఏంజరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో కాలనీ వాసులు, లేడీటీచర్ కుటుంబ సభ్యులు స్కూల్ మీదకు దాడికి వెళ్లారు.
ప్రిన్సిపల్ ను నిలదీశారు. దీంతో ప్రైవేటు స్కూల్ సిబ్బంది.. బాధితులపై రివర్స్ లో కత్తులతో దాడి చేశారు. స్కూల్ లోపెద్దరచ్చగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వైపులా వారిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది. ఆ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకొవాలని కాలనీ వాసులు, టీచర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.