SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వర్షాలు బంద్.. నీళ్ల గండం.. !

Telangana Rains: తెలంగాణలో ఇక వర్షాలకు ఛాన్స్ లేదని వాతావరణ శాఖ ప్రకటించింది. గత మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తూర్పు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు నమోదు అయ్యాయి.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 27, 2026, 02:12 PM IST | Updated: Sep 27, 2026, 02:15 PM IST
Image Credit: Telangana Rains (ZEE Telugu News/Source)
Join

Heavy Rains Stop in Telangana: తెలంగాణలో ఋతుపవనాలు సీజన్ ముగిసినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు అనుకున్నంత స్థాయిలో పడలేదు. వాయు గుండం ప్రభావం  తెలంగాణలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతాయని ఆశించినప్పటికి పెద్దగా ప్రభావం చూపలేక పోయాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలకే వర్షాలు పరిమితం అయ్యాయి. ఇక తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం లేదని IMD తేల్చేసింది.

ఈరోజు నుంచి ఎండల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. లోటు వర్షపాతంతో ఇప్పటికే రైతులు అల్లాడిపోతుంటే...దానికి తోడు ఎండలు మరింత పెరగనున్న నేపథ్యంలో పుండు మీద కారం చల్లినట్లుగా అవుతోంది. ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌పై ఉన్న వాయుగుండం ప్రభావం ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, ఈరోజు ఉదయం 05:30 గంటల సమయానికి మధ్య ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఈ తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం 08:30 గంటల సమయానికి కూడా అదే ప్రాంతంలో కొనసాగింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఇది ఉత్తరప్రదేశ్ మీదుగా ఉత్తర-వాయువ్య దిశగా పయనించి, రాగల 12 గంటల్లో క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తేల్చింది.  ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణ వాతావరణంపై ఇకపై ఉండదని చెప్పింది.

వాతావరణ సూచన..

ఈరోజు,రేపు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.ఈ రోజు రేపు తెలంగాణలో  కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. అదే సమయంలో 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES