SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CM Revanth reddy: దేవుళ్ల మధ్యలో చిచ్చు పెట్టిన రేవంత్ రెడ్డి.!.. శ్రీరాముడు, శివుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏమిటంటే..?.

cm Revanth reddy in delhi visit: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తొంది. అయితే ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీపై విమర్శలు చేస్తు రేవంత్ శ్రీరాముడు, శివుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Written By Inamdar Paresh
Published: Sep 29, 2026, 12:28 PM IST | Updated: Sep 29, 2026, 12:39 PM IST
Image Credit: cmrevanthreddy(file)
Join

Ram god of rich and shiva of poor cm revanth reddy  remarks row: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ వరుస భేటీలతో బిజీగా ఉంటున్నారు.  ఈ రోజు సీడబ్ల్యూసీ సమావేశంలో రెండు ఎమ్మెల్సీల స్థానాల్లో అభ్యర్థులు, సర్ ప్రక్రియ, ఉత్తరఖండ్ లో మల్లి కార్జున ఖర్గే పర్యటన తర్వాత పసుపు నీళ్లతో శుద్ది వంటి పలు అంశాలపై భవిష్యత్ ప్రణాళికపై చర్చలు జరుగనున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏకంగా శ్రీరాముడు, శివుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది.


సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు పదే పదే 'జై శ్రీరామ్' అని ఎందుకు అంటారని, అదే తరహాలో 'హర హర మహాదేవ్' అని ఎందుకు సంభోదించరని ప్రశ్నించారు. ఉత్తరాది ప్రజలు మాత్రమే శ్రీరాముడిని కొలుస్తారని ఇక దక్షిణాది ప్రజలు శివుడిని పూజిస్తారని చెప్పుకొచ్చారు. మేము ద్రవిడులం.. శివుడి భక్తులం. కానీ నార్త్ ఇండియన్స్ ఆర్యులు అని, శ్రీరాముడి భక్తులని మాట్లాడారు.

అందుకే బీజేపీ వాళ్లు "జై శ్రీరామ్" అంటారు.. వాళ్లెప్పుడైనా "హర హర మహాదేవ్" అని అన్నారా? అంటూ వ్యగ్యంగా మాట్లాడారు. శివుడిని 'పేదల దేవుడు'.. శ్రీ రాముడు 'ధనవంతుల దేవుడని అభివర్ణించారు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయ సంస్కృతులు, ఆచారాలు, సామాజిక గుర్తింపుల మధ్య తేడాలున్నాయని చెప్పుకొచ్చారు. 

ఈ వ్యాఖ్యలపై దుమారం రాజుకుంది. దీనిపై హిందూ సంఘాలు, బీజేపీ లు రంగంలోకి దిగి ఈ వ్యాఖ్యలను ఖండించాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య వైశమ్యాలు పెంచేలా ఉన్నాయని, దేవుళ్ల మధ్యలోనే చిచ్చుపెట్టేలా ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని పలువురు బీజేపీ నేతలు సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హిందువులను విభజించేందుకు  కాంగ్రెస్ దిగజారీ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు, డివైడ్ అండ్ రూల్ లో భాగంగా.. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రదీప్ భండారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని 'ఆధునిక ముస్లిం లీగ్ కాంగ్రెస్' అని ఎద్దేవా చేశారు. గతంలో

సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ నిర్మాణంను కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అదే విధంగా ప్రధాని మోదీ జై శ్రీరామ్ తో పాటు,  హర హర మహాదేవ్ అని కూడా నినాదిస్తారని కౌంటర్ ఇచ్చారు. లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడికి పూజలు చేశారని, ఓటు బ్యాంకు కోసం దిగజారుడు రాజకీయాలు చేసే వారికి ఈ విషయాలు తెలియదని ప్రదీప్ భండారీ సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES