• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Jagadish Reddy: తెలంగాణ మంత్రుల ఆత్మలు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారా?: జగదీశ్‌ రెడ్డి

Jagadish Reddy: తెలంగాణ మంత్రుల ఆత్మలు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారా?: జగదీశ్‌ రెడ్డి

Revanth Reddy And Congress Leaders Souls Have At Chandrababu: కృష్ణా జలాల వినియోగం, నాగార్జునసాగర్ నీటి తరలింపు, ఏపీ సొరంగం నిర్మాణం, ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి నిలదీశారు. చంద్రబాబు దగ్గర ఆత్మలు తాకట్టు పెట్టారా? అని రేవంత్ రెడ్డిని, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని నిలదీశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 22, 2026, 07:00 IST|Updated: Nov 22, 2026, 07:03 IST
joinshare
Jagadish Reddy: తెలంగాణ మంత్రుల ఆత్మలు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారా?: జగదీశ్‌ రెడ్డి
Image Credit: Jagadish Reddy

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nagarjuna Sagar Project: 'నాగార్జునసాగర్ గర్భంలో ఏపీ అక్రమ సొరంగం చేస్తుంటే ఎనిమిది నెలలుగా మంత్రులు ఏం చేస్తున్నారు?' అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి నిలదీశారు. శ్రీశైలం నీళ్లను దోచుకుపోయారు.. ఇప్పుడు సాగర్ నీళ్లపైనా కన్నేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. 'ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలు. ఏపీ 290 టీఎంసీలకు పైగా వాడుకుంటే తెలంగాణకు 40 టీఎంసీలు కూడా దక్కలేదు' అని స్పష్టం చేశారు.

నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కృష్ణా జలాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల వినియోగం, నాగార్జునసాగర్ నీటి తరలింపు, ఏపీ సొరంగం నిర్మాణం, ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. '128 టీఎంసీలు తెలంగాణ వాడిందని చెబుతున్నారు. ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు తీసుకున్నారో లెక్కలు బయటపెట్టండి' అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖలు ఎక్కడ? Go నంబర్లతో సహా ప్రజల ముందు పెట్టాలని సవాల్‌ చేశారు. 'ఏపీ సొరంగం నిర్మాణానికి తెలంగాణ అనుమతి ఇచ్చిందా? కేఆర్‌ఎంబీ అనుమతులు ఉన్నాయా కేంద్రం ఏం చెబుతోంది?' అని ప్రశ్నించారు.

'ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క చుక్క నీరు కూడా తీసుకెళ్లనివ్వొద్దు. తెలంగాణ వాటా నీటిని కాపాడాల్సిందే!' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా రైతుల కళ్లముందే కృష్ణమ్మ నీళ్లు కిందికి పోతుంటే మంత్రులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. సాగర్ ఎడమ కాలువ ఎండిపోయింది.. కుడి కాలువ కింద ఏపీ పంటలు పండించుకుంటోందని తెలిపారు. సాగర్ నీళ్లతో తెలంగాణ చెరువులు నింపే సోయి లేదా? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ మంత్రుల ఆత్మలు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారా? మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయా? అని నిలదీశారు.

'నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేసీఆర్ హయాంలో చివరి ఎకరం వరకు నీళ్లిచ్చాం. ఇప్పుడు కాలువల్లో నీళ్లు లేక రైతులు ఎదురుచూస్తున్నారు. ఆరుతడి పంటలు వేయమంటున్నారు.. నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎలా పండించాలి? కూరగాయలు పండించాలన్నా నీళ్లు కావాలి. రైతులకు ఏం సమాధానం చెబుతారు?' అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు.

'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి పడిగాపులు చేసి చివరకు దిక్కులేక ప్రైవేటు వ్యాపారులకు రైతులను అప్పగిస్తున్నారు. మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దళారుల చేతుల్లో పెడుతున్నారు' అని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. తెలంగాణలో మళ్లీ వలసల పరిస్థితి తీసుకొచ్చారని.. రైతులను సంక్షోభంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఎనిమిదేళ్లుగా చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చాం. కాంగ్రెస్ పాలనలో ఒక్కసారి కూడా ఉదయసముద్రం అలుగు దుంకలేదు. నాగార్జునసాగర్‌లో మిగిలిన నీటిని కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలి' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఏపీ సొరంగం నిర్మాణాన్ని ఆపేందుకు ప్రభుత్వం ఏం చేసింది? ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి? అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి కోరారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడకపోతే రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Politics
BRS
Telangana News
Telugu News