SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Palnadu Water Grid: 'కేసీఆర్, జగన్ హయాంలోనే పల్నాడు గ్రిడ్‌కు పునాది పడింది': రేవంత్ రెడ్డి

Revanth Reddy Reaction About Palnadu Water Grid: తీవ్ర వివాదాస్పదంగా మారిన పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పర్యటనపై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన చిత్తశుద్ధిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, జగన్‌ హయాంలోనే పల్నాడు గ్రిడ్‌కు పునాది పడిందని వెల్లడించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 23, 2026, 17:34 IST | Updated: Nov 23, 2026, 17:59 IST
Image Credit: Revanth Reddy Press Meet
Join

Revanth Reddy vs BRS Party: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో నిర్మిస్తున్న పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై రేవంత్‌ రెడ్డి సమగ్ర విశ్లేషణ, వివరణ ఇచ్చారు. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌, జగన్‌ హయాంలోనే అనుమతులు లభించాయని రేవంత్‌ రెడ్డి సాక్ష్యాలతో వివరించారు. కానీ ప్రణాళికబద్దంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తమపై నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

'పల్నాడు గ్రిడ్‌పై ప్రణాళిక బద్దంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపణలు చేస్తోంది. హరీశ్‌ రావు, కేటీఆర్‌ మాపై ఎదురుదాడి నిరాధారంగా చేస్తోంది. ఆనాడు ఏపీకి ఎలా తాకట్టు పెట్టిందో ఆధారాలతో బయటపెడుతున్నా. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెప్పడంతోనే నమ్మే అవకాశం ఉంటుంది. పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంపై జీఓ 56ను ఆనాడు 2022న విడుదల చేశారు. రూ.1,200 కోట్ల అంచనాతో కేంద్రం భరించేలా గుంటూరులో నిర్మాణం కోసం చేశారు. మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.500 కోట్లు భరించడం స్పష్టంగా ఉన్నాయి' అని రేవంత్‌ రెడ్డి వివరించారు.

'వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. ఆనాడు మీరే ఉన్నారు కదా? బడ్జెట్ ఆమోదం తెలిపినప్పుడు హరీశ్ రావు మంత్రిగా ఉన్నారు కదా?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 'వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి మంత్రివర్గంలో నాయిని నరసింహా రెడ్డి ఇన్‌చార్జ్‌గా, హరీశ్ రావు అదే మంత్రివర్గంలో ఉన్న 2005లో పోతిరెడ్డి పాడుపై నిర్ణయం జరిగింది. వైఎస్సార్‌కు హరీశ్‌ రావు గురుదక్షిణ చెల్లించుకున్నాడు. వార్డ్ సభ్యుడు కాకున్నా మంత్రిని చేశాడనే కారణంతో హరీశ్‌ రావు గురుదక్షిణ చెల్లించాడు' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

'నీళ్లు నిధులు నియామకాల కోసం అన్నారు కదా? మీరొచ్చాక ఏం చేశారు?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వాన్ని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. పరివాహక ప్రాంతం ప్రకారం కేటాయింపులు జరగాలి కానీ.. మెజార్టీ వాళ్లకి (ఏపీ) ఇచ్చి 299 టీఎంసీలు చాలు అని తెలంగాణ హక్కులపై మరణశాసనం రాసింది మీరు కదా? బీఆర్‌ఎస్‌ పార్టీని నిలదీశారు. '2020నాడు 512 టీఎంసీలు శాశ్వతంగా హక్కుగా వాళ్లకి ఇచ్చి ధారాదత్తం చేశావు. మీరు సంతకం పెట్టివచ్చి ఎవరిని బద్నామ్ చేస్తారు. ప్రతి రోజు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 11 టీఎంసీలు తరలిపోయేలా సంతకం చేశారు. ఇది ప్రభుత్వ ఉత్తర్వులు' అని రేవంత్‌ రెడ్డి సాక్ష్యాలుగా చూపించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES