• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి..

సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి..

Revanth Reddy: తెలంగాణ రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ యేడాది ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీటి ఎద్దడి నెలకొనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులును పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్ర సీఎంతో సానుకూల చర్చలు జరిగిన రేవంత్ సర్కారు.. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ కోసం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 17, 2026, 15:17 IST|Updated: Nov 17, 2026, 15:21 IST
joinshare
సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి..
Image Credit: Revanth Reddy Vs Vishnu Dev Sai (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana CM Vs Chhattisgadh CM: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో  తెలంగాణలో నీటి అవసరాలు మరింత  పెరిగే అవకాశం ఉందని సీఎం ఛత్తీస్‌గడ్ సీఎంకు వివరించారు. సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని కోరారు.సీఎం విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్  సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టును ముందుగా  కాంతనపల్లి వద్ద ప్రతిపాదించారు. ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు  అంచనా వేశారు. 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ అధ్యయనం ప్రకారం..  పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని చెబుతున్నారు.

ఇప్పటికే సమ్మక సాగర్ ప్రాజెక్ట్ అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌ లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్‌ గవర్నమెంట్‌కు నివేదిక సమర్పించింది.

ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్‌ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద దీని నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు ఉంది. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించుకునే ఉద్దేశ్యంతో  ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.

సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, సహాయ పునరావాసంతో పాటు పరిహారంకి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీగా  ఉందని సీఎం తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని వివరించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌ఓసీని త్వరగా జారీ చేయాలన్నారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Revanth Reddy
National News