SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వైట్‌కాలర్‌ ఉద్యోగాలకు AI పెద్ద ముప్పు.. బ్లూకాలర్‌కే ఢోకా లేదు: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!

Revanth Reddy: తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యువతను గ్లోబల్ పోటీకి సన్నద్ధం చేసేందుకు ఐటీఐలను ఆధునిక డ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్‌ యూనివర్సిటీని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.

Written By Bhoomi
Published: Nov 11, 2026, 03:36 PM IST | Updated: Nov 11, 2026, 03:37 PM IST
Image Credit: Revanth Reddy
Join

Revanth Reddy: తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యువతను గ్లోబల్ పోటీకి సన్నద్ధం చేసేందుకు ఐటీఐలను ఆధునిక  డ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్‌ యూనివర్సిటీని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. బంజారాహిల్స్‌లోని సేవాలాల్‌ బంజారా భవన్‌లో అట్టహాసంగా జరిగిన జాతీయ విద్య,మైనార్టీల సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.

దేశంలో విద్య,  నీటిపారుదల రంగా అభివ్రుద్ధికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ను తొలి విద్యాశాఖ మంత్రిగా నియమించి.. యూనివర్సిటీలు, ఐఐటీల ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేసిందన్నారు.  ఆ ప్రయత్నాల ఫలితంగానే భారతీయులు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని సీఎం తెలిపారు.

వేగంగా మారుతున్న సాంకేతికత గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వైట్-కాలర్ ఉద్యోగాలకు ముప్పు కలిగిస్తుందని.. కానీ బ్లూ-కాలర్ ఉద్యోగాలకు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, మైనారిటీలకు విద్య, ఉద్యోగాలలో 4శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల అంశాన్ని రాజకీయం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు.

మైనారిటీలకు ఇచ్చిన హామీ మేరకు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ పదవి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మీరాలం సరస్సు వద్ద రూ.600 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారని కూడా  పేర్కొన్నారు. మూసీ అభివృద్ధి పూర్తయితే, పాత నగరంలో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, నగర రాత్రి ఆర్థిక వ్యవస్థకు ఊపు వస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్ఐఆర్ పేరుతో పేదలు, మైనారిటీలు, ఎస్టీల ఓట్లను బీజేపీ దొంగిలిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మోదీని ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Also Read: 

ఉన్నదానితో సంతృప్తి చెందడమే అసలైన అదృష్టం అని చెబుతున్న నీతి కథ..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES