• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Gajwel Mro Video: నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.?.. రైతుపై గజ్వేల్ ఎమ్మార్వో వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Gajwel Mro Video: నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.?.. రైతుపై గజ్వేల్ ఎమ్మార్వో వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Gajwel mro controversy video: గజ్వేల్ కు చెందిన రైతు పట్ల ఎమ్మార్వో స్వామి చాలా నీచంగా మాట్లాడాడు.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అధికారులు చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 10, 2026, 03:06 PM IST|Updated: Oct 10, 2026, 03:21 PM IST
joinshare
Gajwel Mro Video:  నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.?.. రైతుపై గజ్వేల్ ఎమ్మార్వో వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..
Image Credit: Gajwel mro controversy video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Abhijeet Dipke Arrest: అభిజీత్ దీప్కే అరెస్ట్ కోసం మహిళా పోలీసులే ఎందుకొచ్చారు? దీని వెనుక పక్కా ప్లాన్ ఉందా?

Abhijeet Dipke Arrest: అభిజీత్ దీప్కే అరెస్ట్ కోసం మహిళా పోలీసులే ఎందుకొచ్చారు? దీని వెనుక పక్కా ప్లాన్ ఉందా?

2

Amazon సేల్‌లో iQOO ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్.. రూ.5,000 వరకు డిస్కౌంట్!

3

Nisha Raphael Case: 11 ఏళ్ల బాలుడ్ని రే*ప్ చేసిన నిషా రాఫెల్?! సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌పై కేసు నమోదు!

4

Gajwel Mro Video: నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.?.. రైతుపై గజ్వేల్ ఎమ్మార్వో వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

5

కారు రీమోడలింగ్ కోసం వృష**ణాలు అమ్మేశాడు? థాయిలాండ్ యువకుడి వైరల్ స్టోరీ..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tahsildar makes derogatory comments on farmer in Gajwel: దేశానికి రైతులు వెన్నెముక లాంటి వారని చెప్తుంటారు. రైతులు పంటలు పండిస్తేనే  ఆ దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. అంతే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం రైతన్నలు యూరియా కొరత, పంటకు మద్దతు ధరలు, ఎల్ నినో సమస్యలు, వర్షాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

 

నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..! సమస్య ఉందని వెళ్లిన రైతుతో అవహేళనగా మాట్లాడిన గజ్వేల్ ఎమ్మార్వో ఒక సమస్య వల్ల తన వ్యవసాయ భూమి తన బ్రతుకుతెరువును కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆశ్రయిస్తే అవహేళనగా మాట్లాడడమే కాకుండా, నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని సమాధానం చెప్పిన ఎమ్మార్వో

— Telugu Scribe (@TeluguScribe) October 10, 2026

 

కొన్ని చోట్ల పంట కొసం ఎంత కష్టపడ్డ  కూడా చేతికి వచ్చే సరికి ఏదో కారణంతో రైతన్నలు నష్టపోయిన ఘటనలు కొకొల్లలు. దీంతో కొంత మంది రైతన్నలు చేసిన అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగుతారు. 

మరికొంత మంది మాత్రం నష్టపరిహరం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టు తిరుగుతుంటారు. అయితే.. కొంత మంది అధికారులు రైతన్నలకు నష్టపరిహరం అందించడంతో తమ తోడ్పాటు అందిస్తారు. కానీ మరికొంత మంది మాత్రం రైతులను తమ ఆఫీసుల చుట్టు తిప్పుకుంటూ చాలా చులకనగా చూస్తారు. ఈక్రమంలో గజ్వేల్  లో ఒక ఎమ్మార్వో రైతు పట్ల చాలా నీచంగా మాట్లాడాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.


సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ కు చెందిన ఎమ్మార్వో  స్వామి రైతు పట్ల చాలా నీచంగా మాట్లాడాడు.  రైతు తన సమస్యల పరిష్కారం కోసం ఆఫీస్ చుట్టు తిరుగుతున్నాడు.  వ్యవసాయ భూమి, జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఎమ్మార్వోను, అధికారులను కలిసి మొరపెట్టుకున్నాడు. కానీ అధికారులు మాత్రం  అస్సలు పట్టించుకోలేదు. 

ఇటీవల జరిగిన ఆఫీస్ మీటింగ్ లో అనేక మంది తమ సమస్యలను ఎమ్మార్వోతో చెప్పు కుంటున్నారు. సదరు రైతును చూసిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి చాలా నీచంగా మాట్లాడాడు. రైతన్నను చూసి నువ్వు ఇంకా చచ్చిపోలేదా..?.. బ్రతికే ఉన్నావా..?.. పురుగుల మందు తాగలేదా..?..అంటూ చాలా అవహేళనగా మాట్లాడాడు.  

దీనికి రైతు అసలే వ్యవసాయ భూమి, జీవనోపాధి కోల్పోయే పరిస్థితిలో ఉన్నట్లు చెప్పాడు. తన సిట్యువేషన్ చూస్తే నవ్వొస్తుందా సర్ అంటూ.. మాట్లాడగా.. అవును వస్తది.. బరాబర్ చనిపోయే సిట్యువేషన్ వస్తదంటూ ఎమ్మార్వో సమాధానం ఇచ్చాడు. 

ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది. తనపై గజ్వేల్ ఎమ్మార్వో స్వామి చేసిన వ్యాఖ్యలకు రైతన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Trending News