• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Nisha Raphael Case: 11 ఏళ్ల బాలుడ్ని రే*ప్ చేసిన నిషా రాఫెల్?! సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌పై కేసు నమోదు!

Nisha Raphael Case: 11 ఏళ్ల బాలుడ్ని రే*ప్ చేసిన నిషా రాఫెల్?! సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌పై కేసు నమోదు!

Nisha Raphael Police Case: 11ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఇన్‌ఫ్లూయెన్సర్ నిషా రాఫెల్‌పై పోలీసు కేసు నమోదయ్యింది. కేరళలోని త్రిస్సూర్‌లోని ఓ బాలుడిపై ఈమె లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వైద్య-న్యాయ పరీక్ష నిర్వహించగా అతడిపై లైంగిక దాడి జరింగిదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Written ByHarish Darla
Published: Oct 10, 2026, 03:18 PM IST|Updated: Oct 10, 2026, 03:21 PM IST
joinshare
Nisha Raphael Case: 11 ఏళ్ల బాలుడ్ని రే*ప్ చేసిన నిషా రాఫెల్?! సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌పై కేసు నమోదు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Abhijeet Dipke: కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే ఇంట పెను విషాదం.. ఏంజరిగిందంటే..?..

Abhijeet Dipke: కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే ఇంట పెను విషాదం.. ఏంజరిగిందంటే..?..

2

Abhijeet Dipke Arrest: అభిజీత్ దీప్కే అరెస్ట్ కోసం మహిళా పోలీసులే ఎందుకొచ్చారు? దీని వెనుక పక్కా ప్లాన్ ఉందా?

3

Amazon సేల్‌లో iQOO ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్.. రూ.5,000 వరకు డిస్కౌంట్!

4

Nisha Raphael Case: 11 ఏళ్ల బాలుడ్ని రే*ప్ చేసిన నిషా రాఫెల్?! సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌పై కేసు నమోదు!

5

Gajwel Mro Video: నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.?.. రైతుపై గజ్వేల్ ఎమ్మార్వో వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nisha Raphael Police Case: సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత సోషల్ మీడియా వ్యాప్తి విపరీతంగా పెరిగింది. అయితే దీనితో పాటుగా నిత్యం ఏదో ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన వార్తలను వినాల్సిన పరిస్థితులు సమాజంలో ఏర్పడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా రంగానికి చెందిన ఒక వ్యక్తిపై తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు రావడం పెద్ద ఎత్తున సంచలనం రేపింది.

నిషా రాఫెల్‌పై తీవ్ర ఆరోపణలు..
త్రిస్సూర్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిషా రాఫెల్‌పై త్రిస్సూర్ వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి తరఫున అందిన ఫిర్యాదులో నిషా రాఫెల్‌కు సంబంధించి అత్యంత తీవ్రమైన ఆరోపణలను పేర్కొనడం జరిగింది.

వైద్య - న్యాయ పరీక్షల్లో నిర్ధారణ..
ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక చర్యల్లో భాగంగా బాధితుడైన 11 ఏళ్ల చిన్నారిని వెంటనే త్రిస్సూర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడికి చట్టపరమైన నిబంధనల ప్రకారం వైద్య - న్యాయ పరీక్షలు (మెడికో - లీగల్ ఎగ్జామినేషన్) నిర్వహించారు. 

ఆసుపత్రిలో జరిపిన ఈ సమగ్ర వైద్య పరీక్షల్లో బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఆ చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగిన విషయాన్ని ఈ పరీక్షల ఫలితాలు అధికారికంగా ధృవీకరించాయి.

వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు రుజువు కావడంతో, ఆ ఆధారాల ప్రాతిపదికన త్రిస్సూర్ వెస్ట్ పోలీసులు నిషా రాఫెల్‌పై అధికారికంగా క్రిమినల్ కేసు నమోదు చేశారు. వచ్చిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి సమగ్రమైన దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతూ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Crime News