• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /విద్యాశాఖ కఠిన చర్యలు.. 68 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు!

విద్యాశాఖ కఠిన చర్యలు.. 68 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు!

FRS Attendance: సర్కారు బడులపై విద్యాశాఖ నజర్ పెట్టింది. విధుల్లో అలసత్వం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో 68 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 06, 2026, 10:10 AM IST|Updated: Oct 06, 2026, 10:11 AM IST
joinshare
విద్యాశాఖ కఠిన చర్యలు.. 68 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు!
Image Credit: Teacher Attendance Telangana

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ప్రపంప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!!

ప్రపంప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!!

2

Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

3

చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!

4

వపర్‌ఫుల్‌ నవపంచమి రాజయోగ ఎఫెక్ట్‌.. ఈ రాశుల వారికి కోరికలు నెరవేరి, పనుల్లో విజయాలే!

5

Nizamabad: భీమ్ గల్ పోలీసు స్టేషన్ లో నిప్పుపెట్టుకున్న వ్యక్తి మృతి.. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తత.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

FRS Attendance: సర్కారు బడులపై విద్యాశాఖ నజర్ పెట్టింది. విధుల్లో అలసత్వం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో 68 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నైజ్ యాప్ లో హాజరు వేయడంలో అలసత్వం వహించినందుకు ఈ చర్యలు తీసుకుంది. పాఠశాలలకు క్రమం తప్పకుండా హాజరుతున్నా.. డిజిటల్ హాజరు నమోదు చేయకపోవడంపై డీఈవో సీరియస్ అయ్యారు. నిర్ణీత వ్యవధిలోగా వివరణ ఇవ్వనట్లయితే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో జిల్లా ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపింది.

పాఠశాలలో టీచర్లు, సిబ్బంది సమయపాలన పాటించేలా చేసేందుకు.. విధులకు సక్రమంగా హాజరయ్యే విధంగా చూసేందుకు ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది టీచర్లు ప్రతిరోజూ స్కూల్ కు సమయానికి వస్తున్నా.. ఎఫ్ఆర్ఎస్ యాప్ లో హాజరు నమోదు చేయడంలో తీవ్ర అలసత్వం చూపినట్లు అధికారులు గుర్తించారు. మరికొంత మంది టీచర్లు టెక్నికల్ ఇష్యూస్  నెపంతో హాజరును విస్మరిస్తున్నట్లు సమాచారం.

ఇదే అంశంపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు.. రూల్స్ అతిక్రమించిన 68 మంది టీచర్లు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత సమయంలోగా సంత్రుప్తికరమైన వివరణ ఇవ్వనట్లయితే.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసింది. స్కూల్స్ పనితీరును మెరుగుపరచడం.. విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల సమయపాలన కీలకమని అధికారులు స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని.. సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే.. వెంటనే అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లాలి తప్ప..హాజరు వేయకపోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఈ చర్యతో జిల్లా వ్యాప్తంగా ఉన్న టీచర్ల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Employees