సెప్టెంబర్‌తో ముగిసిన గడువు.. ఇంకా స్పష్టత లేని పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల్లో ఆందోళన..!!
PRC latest news: తెలంగాణలో పీఆర్సీ కమిషన్ రిపోర్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల సెప్టెంబర్ 30వ తేదీ నాటికే పీఆర్సీ కమిషన్ గడువు ముగిసింది. అయినా గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
PRC latest news: తెలంగాణలో పీఆర్సీ కమిషన్ రిపోర్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల సెప్టెంబర్ 30వ తేదీ నాటికే పీఆర్సీ కమిషన్ గడువు ముగిసింది. అయినా గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో అసలు పీఆర్సీ కమిషన్ మనుగడలో ఉందా అనే సందిగ్ధత ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. కమిషన్ గడువు ముగిసి నెల రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో.. ఈ ప్రభుత్వం నిజంగానే ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుందా అని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి.
అయితే సెప్టెంబర్ 9వ తేదీన ఉద్యోగుల జేఏసీ నేతలతో జరిగిన చర్చల సందర్భంగా సెప్టెంబర్ 18వ తేదీ లోపు పీఆర్సీ రిపోర్టును తెప్పించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దసరాకు గుడ్ న్యూస్ వస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. దాదాపు 38 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు రిపోర్టు తెప్పించుకోలేదు. అసలు ప్రభుత్వం పీఆర్సీ రిపోర్టును ఎప్పటివరకు తెప్పించుకుంటుందని ఉద్యోగులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
కాగా మొదటి పీఆర్సీ గడువు జూన్ 30, 2023న ముగిసింది. రెండవ పీఆర్సీని జులై 1, 2023 నుంచి ఉద్యోగులకు అమలు చేయాల్సి ఉంది. అయితే పీఆర్సీని ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగులు అందరూ కూడా మూడేళ్లపాటు నష్టపోయారు. రిపోర్టు సమర్పించిన తర్వాత మెరుగైన అమరికతో కూడిన పీఆర్సీని సర్కార్ వెంటనే ప్రకటించాలని ఎంప్లాయ్ మెంట్ జేఏసీ కూడా డిమాండ్ చేస్తోంది. కానీ దీన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పీఆర్సీ గడువు ముగిసిన దాదాపు నెల రోజులు అవుతోంది. ప్రభుత్వం గడువు మళ్లీ పొడిగిస్తుందా అనే విషయంపై ఉద్యోగుల జేఏసీ నాయకులకు కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు.
దసరా పండగకు గుడ్ న్యూస్ వింటామని ఆశించిన జేఏసీ నాయకులు.. ఎలాంటి శుభవార్త రాకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నవారు. రిపోర్టును వేగవంతం చేయాలంటూ ఇప్పటికే పీఆర్సీ చైర్మన్ శిశశంకర్ కు లేఖ కూడా రాశారు. అయితే.. ఆ నివేదిక ఇంకా ప్రభుత్వానికి చేరలేదని జేఏసీ నాయకులు చెబుతున్నారు. పీఆర్సీ కమిటీ 6 నెలల్లోకా రిపోర్టు సమర్పించాల్సి ఉండగా.. 3ఏండ్లు అది అందలేదు.. అంతేకాదు పీఆర్సీ ఉద్యోగులకు వర్తించనూలేదు.
కమిషన్ రిపోర్టు అందితే ఉద్యోగులకు ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలి? వేతనాలను ఎంత పెంచాలి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వక తప్పదని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ నివేదిక స్వీకరణకే సుముఖంగా లేదనే ప్రచారం సాగుతోంది. రిపోర్టు అందగానే ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లతో ఒత్తిడి పెంచుతాయని సర్కారు కాలయాపన చేస్తోందని సమాచారం. పెరుగుతున్న ధరలు.. నిత్యావసరాల ఖర్చుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. పెన్షనర్లు కొత్త పీఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, పీఆర్సీ ప్రకటిస్తే ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారం.. రాష్ట్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణం చూపి, ప్రభుత్వం ఈ ప్రక్రియను పక్కన పెడుతోందా అనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
పీఆర్సీ కమిషన్ తన నివేదికను ఎప్పుడో సిద్ధం చేసినప్పటికీ.. దానిని అందుకోవడానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం 1 జూలై 2023 నుంచే రెండవ పీఆర్సీ వర్తించాల్సి ఉండగా.. ఈ జాప్యం వల్ల మూడేళ్లుగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు 50 శాతం ఫిట్మెంట్ కోరుతుండగా.. . ప్రభుత్వం 1 శాతం ఫిట్‌మెంట్ పెంచినా ఏటా రూ. 200 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని భావిస్తోంది. ప్రభుత్వం 10శాతం, 20శాతం లేదా 30శాతం వరకు ఎంత ఇస్తుందనేది నివేదిక బయటకు వస్తేనే స్పష్టమవుతుంది. 20శాతం నుండి 30శాతం మధ్య ఇచ్చినా.. అంగీకరించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో మొదటి పీఆర్సీ కమిషన్ 7.5 శాతమే సిఫార్సు చేసినప్పటికీ.. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఆ అనుభవంతోనే... ఈసారి 2వ పీఆర్సీలో తమకు 45 నుండి 50 శాతం వరకు ఫిట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Also Read: