Airtel Rs 598 recharge plan: ఎయిర్‌టెల్ యూజర్‌లకు ఇప్పటికే విభిన్న రీఛార్జీ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ఎయిర్‌టెల్ ఇటీవలె వాయిస్ ఓన్లీ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఎయిర్ టెల్ రూ.598 ప్లాన్ బంపర్ బెనిఫిట్స్ అందిస్తోంది. ప్రతి రోజూ 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. దీంతోపాటు నెట్‌ఫ్లికస్ బేసిక్, జియోహాట్‌స్టార్ సూపర్, జీ5 ప్రీమియం, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే 5జీ డేటా, ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం కూడా పొందుతారు.
ఎయిర్‌టెల్ రూ.598 ప్లాన్..
ఎయిర్‌టెల్ రూ.598 ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులపాటు మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2 జీబీ డేటా, అంటే మొత్తం 56 జీబీ డేటా పొందుతారు. దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్‌తోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందవచ్చు.
నెట్‌ఫ్లిక్స్ బేసిక్..
ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే కాలింగ్, నెట్ సౌకర్యంతోపాటు అదనంగా మీరు ఓటీటీలు కొనుగోలు చేయాల్సిన పనిలేదు.. 28 రోజులపాటు కూడా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రీప్షన్ లభిస్తుంది. దీంతో మీరు సినిమా, వెబ్‌సిరీస్, ఒరిజినల్ షోలు కూడా వీక్షించవచ్చు. ఈ ప్లాన్‌తో మీరు రీఛార్జ్ చేసుకునే ముందు ఆఫర్స్ చూసి కొనుగోలు చేయండి.
జియో హాట్‌స్టార్ సూపర్, జీ5 ప్రీమియం..
ఎయిర్‌టెల్ రూ.598 ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్‌తోపాటు ఒక నెలపాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రీప్షన్ పొందుతారు. ఇందులో కూడా సినిమాలు, సీరియల్స్ ,వెబ్‌సిరీస్
అందుబాటులో ఉంటుంది. 28 రోజులపాటు జీ5 ప్రీమియం కూడా లభిస్తుంది. వేర్వేరుగా రీఛార్జీ చేయాల్సిన పనిలేదు, సింగిల్ ప్లాన్‌తో ఈ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం..
ఎయిర్‌టెల్ రూ.598 ప్లాన్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ ప్రీమియం యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇందులో కూడా మీరు ఓటీటీ కంటెంట్ లభిస్తుంది. అంటే ఒక్క రీఛార్జీ ప్లాన్‌తో మీరు ఇన్ని ఓటీటీలు కూడా పొందుతారు.దీంతోపాటు ఈ ప్లాన్‌లో మీరు అదనంగా 12 నెలలపాటు ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం రూ.4000 విలువ ఉండే ప్లాన్ కూడా ఉచితంగా పొందుతారు.