Telangana Bar Strike: తమ డిమాండ్లను పరిష్కరించాలని నిన్న ఎక్సైజ్ ఆఫీస్ ముందు బార్ యజమానులు ధర్నా చేశారు. ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో, రెండో రోజు కూడా బార్లను, రెస్టారెంట్లను బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో మందుబాబులు గందరగోళంలో పడ్డారు. ఇప్పటికే ఉన్న పన్నులకే తోడుగా ప్రివిలెజ్ ఫీజును విధించడం వల్ల బార్లు నడవని పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో యజమానులపై భారీ ఆర్థిక భారం పడుతుందని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వం విధించే ఈ ప్రివిలెజ్ ట్యాక్స్ వల్ల రిటైలర్ మార్జిన్ 14 శాతం నుండి 4 శాతం పడిపోతుందని, బార్లు ఎంఆర్‌పి ధరలకే లిక్కర్ కొనుగోలు చేయాల్సి వస్తుందని, అప్పుడు పడే పన్నులనే బెల్ట్ షాపుల భారాంగా పరిగణించవచ్చని యజమానులు వాదిస్తున్నారు. నిబంధనల ప్రకారం పర్మిట్ రూమ్లలో ఆహార పదార్థాలు, బెంచీలు, కుర్చీలు, టీవీలకు అనుమతి లేదు, కానీ ప్రస్తుతం వైన్ షాపుల వద్ద ఇవన్నీ విచ్చలవిడిగా ఉన్నాయని, వీటిని వెంటనే నియంత్రించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, కరోనా కాలం నుండి వసూలు చేస్తున్న స్పెషల్ ఎక్సైజ్, ఎంఆర్‌పి రౌండ్ ఆప్షన్‌లు తొలగించి ఇన్వాయిస్‌లో కలపాలని, బార్ రెన్యూవల్ ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేయాలని, అలాగే వైన్ షాపుల పరిధిలో రాత్రి 10 గంటలకే క్లోజ్ చేసి బార్లను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. రిటైలర్ మార్జిన్ 18-20 శాతం ఉండాలి కానీ వివిధ పన్నుల వల్ల అది 13-14% కి పడిపోతోందని ఎక్సైజ్ కమిషనర్‌కు విన్నవించారు. లైసెన్స్ ఫీజులు, స్పెషల్ ఎక్సైజ్ టాక్స్, ప్రివిలెజ్ ఫీజు, టర్నోవర్ టాక్స్ వంటి అనేక పన్నుల భారం వల్ల వ్యాపారం లాభాల్లో ఉన్నా లేకపోయినా కచ్చితంగా చెల్లించాల్సి వస్తోందని, ఇది బార్ నడపడాన్ని కష్టతరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాపుల పర్మిట్ రూమ్‌ల వల్ల బార్ల వ్యాపారం దెబ్బతింటోందని, దీనివల్ల బార్లలో ఉపాధి పొందుతున్న వందలాది మందికి నష్టం వాటిల్లుతుందని, ఇప్పటికే అధిక వడ్డీలకు ఫైనాన్స్ చేసుకుని నడుపుతున్న బార్ యజమానులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని వారు తెలిపారు.
ప్రతి సంవత్సరం బార్ రెన్యూవల్ చేయాలనే నిబంధన వల్ల బ్యాంకింగ్ రంగం మాకు ఎటువంటి రుణాలు ఇవ్వడం లేదు, అందుకే ఐదు సంవత్సరాలకు ఒకసారి రిన్యూవల్ చేసేలా చూడాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, బెల్ట్ షాపులు 24 గంటలు నడపడం వల్ల వాటి అమ్మకాలు బార్ల అమ్మకాల కంటే ఎక్కువగా ఉన్నాయని చెబుతూ మీ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజులు, వివిధ రకాల పన్నులు, సేల్స్ టాక్స్‌లు చెల్లించడంతో పాటు, నిర్వహణ ఖర్చులు, అప్పులపై అధిక వడ్డీలు చెల్లించడం వల్ల మద్యం వ్యాపార రంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి సంక్షోభంలో ఉంది. దీనిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటూ, ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తే మా బార్లు నష్టపోవని యజమానులు చెబుతున్నారు. పర్మిట్ రూమ్స్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు అమ్మకూడదని, షిప్పింగ్ ఏర్పాటు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, వాస్తవానికి పర్మిట్ రూమ్స్‌లో వైన్స్‌తో పాటు భారీ ఎత్తున ఇతర వస్తువులను విక్రయిస్తున్నారు. పర్మిట్ రూమ్స్‌కు పరిమితులు ఉన్నప్పటికీ, కొన్ని ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల మా బార్లు నష్టపోతున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, బెల్ట్ షాపుల వల్ల కూడా మేము తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి, తక్షణమే పర్మిట్ రూమ్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిన్న ఎక్సైజ్ కమిషనర్‌ను కలిసి, తమ సమస్యలను వివరిస్తూ ముఖ్యంగా 'ప్రివిలేజ్ ట్యాక్స్' వల్ల తాము నష్టపోతున్నామని, కాబట్టి వెంటనే ఆ ప్రివిలేజీని రద్దు చేయాలని కోరారు. అలాగే నిబంధనలను సరిగ్గా అమలు చేస్తే తమ నష్టాలు తగ్గుతాయని, పర్మిట్ రూమ్ వ్యవహారంపై స్పందించాలని బార్ యజమానులందరూ కలిసి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్‌ను కలిసినప్పటికీ, ఆయన ఈ విషయంలో ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం దృష్టికి వెళ్లాలని, సమస్య పరిష్కారం కాకపోతే బార్లు మూసివేస్తామని వారు హెచ్చరించారు. నిన్న మంత్రి జిల్లా పర్యటనలో ఉండటం వల్ల కలవలేకపోయారు. ఒకవేళ సమస్యకు పరిష్కారం లభించకపోతే బార్లను మూసివేస్తామని నిన్ననే ప్రకటించిన వారు, అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లన్నింటినీ మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందింది.