• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /1890ల నాటి తెలంగాణ ఆడపడుచులా ముస్తాబు.. గోచీ చీరలో బతుకమ్మ ఆడుతూ నెట్టింట వైరలైన యువతి!

1890ల నాటి తెలంగాణ ఆడపడుచులా ముస్తాబు.. గోచీ చీరలో బతుకమ్మ ఆడుతూ నెట్టింట వైరలైన యువతి!

Bathukamma Reel Viral Video: తెలంగాణలో సరిగ్గా 130 ఏళ్ల క్రితం బతుకమ్మ సమయాల్లో మహిళలు ఎలా ముస్తబు అయ్యేవారో.. ఎలాంటి వస్త్రాలతో బతుకమ్మను ఆడేవారో? అనే అంశాలను గుర్తు చేస్తూ ఓ యువతి రీల్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 12, 2026, 01:00 PM IST|Updated: Oct 12, 2026, 01:03 PM IST
joinshare
1890ల నాటి తెలంగాణ ఆడపడుచులా ముస్తాబు.. గోచీ చీరలో బతుకమ్మ ఆడుతూ నెట్టింట వైరలైన యువతి!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

2

KBR పార్క్‌ కూడళ్ల విస్తరణకు చకచకా ఏర్పాట్లు.. బాలకృష్ణ ఇంటి నుంచి భూసేకరణ ప్రారంభం..

3

'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..

4

AP Rythu Bazar Rice Price: ఏపీలో పేదలకు భారీ ఉపశమనం..రైతు బజార్లో రూ.49, రూ.50లకే సన్నబియ్యం పంపిణీ!

5

ప్రభుత్వ బడుల భవిష్యత్తు మారాలంటే GO 25 సవరించాల్సిందే.. 5,490 FLN పాఠశాలలపై టీచర్ల కీలక డిమాండ్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bathukamma Reel Video: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే పూల పండుగ  బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఊరూవాడా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి.. చప్పట్లు కొడుతూ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు ఆడుతున్నారు. అయితే, ఆధునిక కాలంలో వింత వింత పాశ్చాత్త సంస్కృతి అనుసరిస్తున్న నేటి రోజుల్లో.. కొందరు యువతులు తమ మూలాలను, ప్రాచీన సంప్రదాయాలను గుర్తుచేస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వస్తున్నారు. సరిగ్గా 1890ల కాలంలో తెలంగాణ మహిళలు ఎలాంటి దుస్తులు, ఆభరణాలు ధరించేవారో గుర్తు చేస్తూ.. ఓ యువతి చేసిన రీల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..

సుమారు 130 ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో స్త్రీలు అద్భుతమైన కట్టుబొట్లతో జీవించేవారు.. ఆ నాటి కాలంలో మహిళలు ధరించే.. సాంప్రదాయక పసుపు రంగు గోచీ చీర, అప్పటి ప్రత్యేక ఆభరణాలు, నుదుటన పెట్టిన పెద్ద బొట్టు.. వీటన్నింటినీ పెట్టుకుని ఆ యువతి ముస్తాబైంది.. అంతేకాకుండా ప్రకృతి సిద్ధమైన తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి.. నాటి గ్రామీణ యువతి లాగే పరవశించి ఆడుతూ రీల్ వీడియో పోస్ట్ చేసింది..

టైమ్‌లెస్ తను (Timeless Thanu) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేసిన ఈ రీల్ నెట్టింట విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా.. లక్షకు పైగా లైకులు వచ్చాయి.. నేటి డిజిటల్ యుగంలో కేవలం ఆధునిక ట్రెండ్స్ వెంటే పడకుండా.. మన పూర్వీకుల జీవన విధానాన్ని, నాటి సంస్కృతిని గుర్తు చేస్తూ భావితరాలకు అందించే ప్రయత్నం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు నిజమైన తెలంగాణ మూలాలను కళ్లముందుంచారు.. పాతకాలపు సంస్కృతికి అద్దం పట్టినట్లుంది.. అంటూ ప్రశంసలతో కామెంట్లు పెడుతున్నారు. బతుకమ్మ పండుగ వేళ మన పూర్వ వైభవాన్ని.. తరాల నాటి కట్టుబొట్టును గుర్తుచేస్తూ.. రూపొందించిన ఈ వీడియో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని మరోసారి చాటిచెప్పింది.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by అశ్విత•Ashwitha (@timeless_thanu)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Viral News