• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /టీడీఆర్ సేవలకు ఆధార్ అథెంటికేషన్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవే!

టీడీఆర్ సేవలకు ఆధార్ అథెంటికేషన్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవే!

Telangana GO 255: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) ప్రక్రియను మరింత పారదర్శకంగా, భద్రంగా నిర్వహించేందుకు ఒక ముఖ్యమైన అడుగు వేసింది.

Written ByBhoomi
Published: Oct 23, 2026, 09:23 AM IST|Updated: Oct 23, 2026, 09:24 AM IST
joinshare
టీడీఆర్ సేవలకు ఆధార్ అథెంటికేషన్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవే!
Image Credit: Telangana GO 255

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Prabhas Fauzi Poster: ఫౌజీ పోస్టర్‌లో ఆసక్తికర విషయాలు.. 1939 నుంచి మోస్ట్ వాంటెడ్‌గా ప్రభాస్.. అసలు కథేంటి?

Prabhas Fauzi Poster: ఫౌజీ పోస్టర్‌లో ఆసక్తికర విషయాలు.. 1939 నుంచి మోస్ట్ వాంటెడ్‌గా ప్రభాస్.. అసలు కథేంటి?

2

Siddipet: సిద్దిపేట్‌లో దసరా రోజు ఘోరం.. మైనర్ బాలికపై సాముహిక అత్యాచారం.. ఆలస్యంగా బైటపడ్డ ఘటన .!.

3

పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధరలు..!!

4

BSNL BYO OTT Builder: BSNL యూజర్లకు బంపర్ ఆఫర్..రూ.549కే 4000 జీబీ డేటా..25కు పైగా ఓటీటీలు ఉచితం!

5

Skip Breakfast Risk: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి కాఫీలు, టీలతో సరిపెడుతున్నారా..?.. ఈ డెంజర్ లో పడ్డట్లే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana GO 255: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) ప్రక్రియను మరింత పారదర్శకంగా, భద్రంగా నిర్వహించేందుకు ఒక ముఖ్యమైన అడుగు వేసింది. టీడీఆర్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌ (Aadhaar Authentication) విధానాన్ని అమలు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. లావాదేవీల్లో జరిగే మోసాలు, ఫేక్ రిజిస్ట్రేషన్లు, అనఫిషియల్ లాగిన్స్ వంటి అక్రమాలకు చెక్ పెట్టడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.

నూతన విధానం ప్రకారం.. ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లు టీడీఆర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్, లాగిన్ దరఖాస్తుల సమర్పణ వంటి సేవలకు ఆధార్ అథెంటికేషన్ వినియోగించుకోవచ్చు. దీనివల్ల ఆస్తుల వివరాలను డేటాబేస్ తో అనుసంధానం చేయడం మరింత సులభం అవుతుంది. కేవలం వినియోగదారులకే కాకుండా.. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరోష్ అధికారుల పరిపాలనాపరమైన లావాదేవీలకు కూడా ఆధార్ అథెంటికేషన్ వర్తిస్తుంది. దీంతో రికార్డుల కచ్చితత్వం మెరుగుపడటంతోపాటు.. మొత్తం ప్రక్రియలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని సర్కార్ భావిస్తోంది.

ఇక టీడీఆర్ ప్రక్రియలో ఆధార్ వినియోగాన్ని తప్పనిసరి చేయలేదు. ఇది పూర్తిగా స్వచ్చందమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ కార్డుదారుల ముందస్తు అనుమతితోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఎవరైనా ఆధార్‌ను ఉపయోగించకూడదనుకుంటే లేదా సాంకేతిక కారణాల వల్ల దానిని ఉపయోగించలేకపోతే, వారికి ఎలాంటి సేవలు నిరాకరించబడవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటువంటి సందర్భాలలో, అదనపు గుర్తింపు రుజువుగా పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డును సమర్పించవచ్చని తెలిపింది.

ఆధార్ చట్టం.. దాని సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ శాఖ పేర్కొంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ   యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం ఈ విధానాన్ని ఆమోదించినట్లు తెలిపింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Govt Schemes