Skipping breakfast side effects on human body: సమాజంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించడమే టార్గెట్ గా పనులు చేస్తున్నారు. దీని కోసం పగలనక, రాత్రనక పనులు చేస్తు తమ జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నారు. మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని దాన్ని కాపాడుకుంటూ ఉండాలని చెబుతుంటారు. ఒక్కసారి ఆరోగ్యం పాడైతే ఎంత సంపాదించిన, ఎన్ని కోట్లున్నదాన్ని తిరిగి తెచ్చుకోలేమని చెబుతారు. అందుకే సరైన విధంగా క్రమశిక్షణ గా ఉంటూ టైమ్ కు తగ్గ సమతుల్య ఆహరం తీసుకుంటూ అన్ని పనులు చేసుకొవాలి. ఇటీవల కొన్ని అధ్యయనాల్లో చాలా మంది జాబ్ లు చేస్తున్న వారు ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లను స్కిప్ చేస్తున్నట్లు విషయం బైటపడింది. దీనికి బదులుగా కాఫీలు, టీలు వీటితో పాటు బిస్కట్ లు లేదా బన్ లో తమ డేను స్టార్ట్ చేస్తున్నారు. దీంతో శరీరంలో అనేక మార్పులు కల్గుతాయి. ఖాళీ కడుపుతో పొరపాటున కూడా కాఫీలు, టీలు తాగొద్దని నిపుణలు చెబుతుంటారు.
కెఫీన్ విడుదల కావడంతో పాటు శరీరంలోపలి అవయవాలు దెబ్బతింటాయి. దీని వల్ల ఆకలి మందగిస్తుంది. కడుపులో ఆకలిగా అన్పించదు. దీని వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హర్మోన్ విపరీతంగా రిలీజ్ అవుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళనలు, టెన్షన్ లు పెరిగిపోతాయి. చేస పని మీద ఏకాగ్రత కుదరదు. మొత్తంగా జీవగడియారంపై ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
అందుకు పరగడుపున టీలు, కాఫీలు తాగడం వంటివి చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టిఫిన్ ను స్కిప్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు కన్పిస్తాయి. దీని వల్ల డయాబెటిక్ సమస్యల బారిన పడే చాన్స్ ఉంది. పొట్ట చుట్టు కొవ్వు పెరుకుని పోవడం, ఒత్తిడి మరింత పెరిగి కొంత మందిలో గుండెపోటు సమస్యలు కూడావచ్చు ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ మాత్రం అస్సలు మిస్ చేయోద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా ఏమితినాలంటే..?..
మార్నింగ్ లేచిన తర్వాత శుభ్రంగా బ్రేష్ చేసుకొవాలి. ఆ తర్వాత రెండు గ్లాసుల నీళ్లను తాగాలి. సరైన సదుపాయం, వెసులుబాటు ఉన్న వాళ్లు టిఫిన్ లు ఏదైన అందుబాటులో ఉంటే అది తినాలి. మొలకెత్తిన పెసర్లు, ఎర్రటి శనగలు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైన పండ్లు తినాలి. డ్రైఫ్రూట్స్ బాదం,అంజిర్ ల వంటివి నీళ్లలో నానబెట్టుకుని ఉదయం పూట తినాలి. ఈ విధంగా తింటే శరీరం సమతుల్యంగా ఉంటు జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.