SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్.. ఇంటింటా దరఖాస్తులు! నవంబర్ 19 నుంచి ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా పథకం!

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 19న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 06, 2026, 08:54 AM IST | Updated: Nov 06, 2026, 09:41 AM IST
Image Credit: Indiramma Jeevitha Bheema Scheme Telangana:
Join

Indiramma Jeevitha Bheema Scheme Telangana: తెలంగాణలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తించనుంది. ఇందిరమ్మ బీమా పథకం కోసం నవంబర్ 20 నుండి 30 వరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను సేకరిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలంగాణ శాశ్వత నివాసులై ఉండాలి. వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పూర్తి వివరాలను, అర్హతలు, మార్గదర్శకాలను ప్రభుత్వం అతి త్వరలో విడుదల చేయనుంది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అర్హత గల కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. ఇటీవల నిన్న జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఈ పథకం అమలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19, 2026న సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. నవంబర్ 20 నుంచి నవంబర్ 30, 2026 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను సేకరిస్తాయి. ఒకవేళ కుటుంబ యజమాని లేదా సభ్యుడు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకానికి లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..
Read Also: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి దీపావళి పండుగ.. మూడు రోజులు అక్కడే!

ఇందిరమ్మ కమిటీలు సేకరించిన దరఖాస్తులను ఆయా మండల తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్వీకరించి పరిశీలిస్తారు. ప్రభుత్వం ప్రాథమికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి. కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉండాలి. ఈ పథకం పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు వర్తింపజేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో కులమత నిబంధనలు ఏమీ లేవు.

ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఆన్‌లైన్ లింకులు విడుదల కాలేదు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ లింకులు, ఫేక్ ఫోన్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం సూచిస్తోంది. నవంబర్ 20 నుంచి ప్రభుత్వ అధికారులే నేరుగా ఇంటింటికి వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారు. గతంలో ఉన్న రైతు బీమా పథకం కేవలం ఒక రైతుకు మాత్రమే వర్తించేది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబంలోని సభ్యులందరికీ రూ.5 లక్షల బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES