• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /స్కూల్‌కు వస్తున్న ఇద్దరు టీచర్లు.. కానీ చదువుకోవడానికి పిల్లలే లేరు! అసలేం జరిగింది?

స్కూల్‌కు వస్తున్న ఇద్దరు టీచర్లు.. కానీ చదువుకోవడానికి పిల్లలే లేరు! అసలేం జరిగింది?

Two Teachers No Students: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ స్కూల్‌ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. చదువుకోవడానికి బడిలో ఒక్క స్కూడెంట్‌ లేకపోయి.. ఇద్దరు టీచర్స్‌ ఉండడం ఆశ్చర్యంగా ఉందంటూ విద్యావేత్తలు అంటున్నారు. అసలు ఆ స్కూల్‌లో ఒక్క స్టూడెంట్‌ లేకపోవడానికి గల కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Oct 02, 2026, 06:04 PM IST|Updated: Oct 02, 2026, 06:06 PM IST
joinshare
స్కూల్‌కు వస్తున్న ఇద్దరు టీచర్లు.. కానీ చదువుకోవడానికి పిల్లలే లేరు! అసలేం జరిగింది?
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Indian Hockey: 44 ఏళ్ల కసి తీర్చుకున్న భారత మహిళలు.. హకీలో స్వర్ణం కైవసం

Indian Hockey: 44 ఏళ్ల కసి తీర్చుకున్న భారత మహిళలు.. హకీలో స్వర్ణం కైవసం

2

తెలంగాణ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌కు భారీ విరాళం.. నాగర్ కర్నూల్, వికారాబాద్‌లో కమ్యూనిటీ కిచెన్లు

3

స్కూల్‌కు వస్తున్న ఇద్దరు టీచర్లు.. కానీ చదువుకోవడానికి పిల్లలే లేరు! అసలేం జరిగింది?

4

సుప్రీంకోర్టులో రూ.35 వేల జీతంతో 250 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతోనే జాబ్.. పూర్తి వివరాలివే!

5

ఆ జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పదవులకు బిగ్‌ ఫైట్.. కూటమి పార్టీల మైండ్ గేమ్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Two Teachers No Students Telugu News: తరగతి గదిలో పిల్లల సందడి అస్సలు లేదు.. బ్లాక్‌బోర్డుపై అక్షరాలు కూడా లేవు... బడి గంటలు, ఆటల అరుపుల్లో పిల్లల మాటలు వినిపించవు.. అయినా సరే.. రోజూ ఉదయాన్నే పాఠశాల గేట్లు తెరుచుకుంటాయి.. సమయానికి ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారవుతూ ఉంటారు.. రోజంతా అక్కడే ఉండి సాయంత్రం తాళం వేసి బడి నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఉంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ విచిత్ర పరిస్థితి ఇప్పుడు సోసల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నాగారం పంచాయతీ పరిధిలోని భోజ్యాతండా ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు అవుతోంది.. అయినప్పటికీ.. ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా ఈ స్కూల్‌లో చేరలేదంటే తప్పకుండా నమ్మాల్సిందే.. గతేడాది ఇక్కడ 11 మంది విద్యార్థులు చదువుకోగా.. ఈ విద్యా సంవత్సరంలో వారి తల్లిదండ్రులు అక్కడే దగ్గరే ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌ వైపు మొగ్గు చూపారు... దీంతో ఈ పాఠశాలలో నమోదు సంఖ్య పూర్తిగా తగ్గింపోతూ ఏకంగా సున్నాకు పడిపోయింది.

గతంలో అదనపు కలెక్టర్ చేతుల మీదుగా మొదలైన ఈ బడి.. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని మండల విద్యాశాఖాధికారి (MEO) కూడా స్పష్టం చేశారు. విద్యార్థులు లేకపోవడంతో నిత్యం ఖాళీగా దర్శనమిస్తున్న తరగతి గదుల్లోనే ఇద్దరు ఉపాధ్యాయులు గంటల తరబడి సమయం గడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు..

విద్యార్థులే లేని చోట.. ఇద్దరు ఉపాధ్యాయులను అలాగే కొనసాగిస్తూ.. ప్రభుత్వం నెలనెలా వేతనాలు చెల్లించడంపై స్థానికులతో పాటు విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. అలాంటి పాఠశాలల్లో పిల్లలు ఉన్నా.. బోధించేవారు లేక ఇబ్బందులు పడుతుంటే.. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలో ఇద్దరు టీచర్లను ఉంచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News