SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CM Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు సెలవు ప్రకటిస్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ..!.

Ganesh Immersion in Telangana: తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వినాయక నిమజ్జనంను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు సెలవు దినంగా ప్రకటిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Written By Inamdar Paresh
Published: Sep 23, 2026, 06:34 PM IST | Updated: Sep 23, 2026, 06:45 PM IST
Image Credit: cmrevanthreddy(file)
Join

Telangana govt declares holiday for schools and govt offices on september 25: తెలంగాణలో గణపయ్య విగ్రహల నిమజ్జనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వినాయక నిమజ్జనం రోజు పలు జిల్లాల్లో వైన్ షాపులను బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవును ప్రకటించింది. అదే విధంగా..నవంబర్ 14 పనిదినంగా ఉంటుందని తెలిపింది.

​వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు.. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.  

​ఈ సెలవుకు బదులుగా 2026 నవంబర్ 14వ తేదీని (రెండో శనివారం) పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో (G.O.Rt.No.1396) పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.  మరోవైపు మరొకవైపు ప్రశాంత వాతావరణంలో వేడుకలు పూర్తి కావడానికి వీలుగా వైన్ షాపులపై విక్రయాలపై ఆంక్షలు విధించారు. 

హైదరాబాద్ లో సెప్టెంబర్ 25న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అయితే.. ఇక్కడ స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులలోని బార్లకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహయింపును ఇచ్చారు. ఇక నిమజ్జనం రోజు బందో బస్తు కోసం భారీగా బలగాను జంట నగరాల పరిధిలో పోలీసులు మోహరించారు. ఏఐ టెక్నాలజీతో బందోబస్తును చేపట్టనున్నట్లు సీపీ సజ్జనార్ ప్రకటించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES