• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణలో కరువు తీరా కుమ్మేస్తోన్న వర్షం..

తెలంగాణలో కరువు తీరా కుమ్మేస్తోన్న వర్షం..

Telangana Heavy Rains: నైఋతి ఋతుపవనాలు ప్రభావం ఈ సారి తెలుగు రాష్ట్రాలపై అంతగా ప్రభావం చూపలేదు. ముఖ్యంగా పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన వేడి గాలుల తీవ్రత ఎల్‌నినోగా మార్పు చెందింది. దీంతో కురువాల్సిన వర్షపాతం కంటే తక్కువగా కురిసింది. అయితే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తగినంత వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఈ పరిస్థితుల్లో వరుణుడు తెలంగాణపై చల్లని చూపు చూస్తున్నాడు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 01, 2026, 08:24 AM IST|Updated: Nov 01, 2026, 08:26 AM IST
joinshare
తెలంగాణలో కరువు తీరా కుమ్మేస్తోన్న వర్షం..
Image Credit: Telangana Rains (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
పండగ ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర..!!

పండగ ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర..!!

2

Balakrishna: పనిచేసే వారికి ఓటెయ్యాలి.. హిందూపురంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..

3

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. గరిష్ఠ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!

4

Yadadri: చౌటుప్పల్ లో జోగిని దారుణ హత్య.. 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు దోపిడి..

5

AP Municipal Elections: ఓటరు చిటీ ఉందా..?.. కేజీ చికెన్ ఫ్రీ.. ఏపీలో లోకల్ దంగల్ వేళ బంపర్ ఆఫర్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Rains: అవును కరువుతో అల్లాడిపోతున్న తెలంగాణపై వరుణుడు కరుణ చూపిస్తున్నాడు. మొన్న హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. దాంతో ఎన్నో రోజుల తర్వాత భాగ్యనగరం వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. నిన్న  కూడా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసాయి. ఇక ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టాయి.

తిమ్మాపూర్‌లో అత్యధిక వర్షపాతం.. 

నిన్న సాయంత్రం 6 గంటల వరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో 57.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మహబూబా బాద్ జిల్లా కేసముద్రంలో 35.5 మిల్లిమీటర్లు, కామారెడ్డి నాగిరెడ్డి పేటలో 35.3 మిల్లీమీటర్లు, మహబూబా బాద్ ఆమన్‌గల్‌లో 33.5 మిల్లీ మీటర్లు..  సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ లో 32 మిల్లీ మీటర్లు , కామారెడ్డి జిల్లా బంజారాతండాలో 31 మిల్లిమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపూర్ లో 28 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. నిన్న రాత్రి  వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి.  

రాబోయే 72 గంటల పాటు వర్షాలు.. 
ఇక  హైదరాబాద్‌లో మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని గండిమైసమ్మ, జీహెచ్ఎంసీ పరిధిలోని ముషీరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మొత్తంగా రాబోయే 48 గంటల నుంచి 72 గంటల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా  ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Weather Update
Hyderabad
Telugu News
Rain News