SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష..!!

Telangana High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి జైలు శిక్ష విధించింది.

Written By Bhoomi
Published: Nov 09, 2026, 07:26 PM IST | Updated: Nov 09, 2026, 07:28 PM IST
Image Credit: Telangana High Court
Join

Telangana High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి జైలు శిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం.. కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. జస్టిస్ కె. లక్ష్మణ్ నేత్రుత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కలెక్టర్ కు 6 నెలల సాధారణ జైలు శిక్షతోపాటు రూ. 2వేల జరిమానాను కూడా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా సదరు శిక్ష అమలును 4 వారాలపాటు నిలిపివేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే.. 
రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22-ఎ కింద నిషేధిత ఆస్తుల జాబితా నుండి కొన్ని ప్లాట్లను తొలగించాలని కోరుతూ బాధితులు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించాలని హైకోర్టు గతంలో కలెక్టర్‌ను ఆదేశించింది. ఆగస్టు 2025 నాటి కోర్టు ఉత్తర్వు ప్రకారం, ఈ పిటిషన్‌ను 60 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంది. అయితే, కోర్టు నిర్దేశించిన 60 రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, బాధితులు అక్టోబర్ 15, 2025న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌ను నమోదు చేసిన తర్వాతే ప్రక్రియ ముందుకు కదిలింది. అధికారులు బాధితులకు నోటీసులు జారీ చేసి, ఫిబ్రవరి 26, 2026న వారి పిటిషన్‌ను తిరస్కరించారు. ఆ తర్వాత, జూలై 8న మరో తిరస్కరణ ఉత్తర్వు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే ప్రక్రియను ముగించడం పట్ల ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
 

ఉల్లంఘనపై దర్యాప్తు... సంచలన తీర్పు

కోర్టు ఉత్తర్వులకు స్పందించకుండా.. పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా విమర్శించిన హైకోర్టు, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఐఏఎస్ స్థాయి అధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదని ధర్మాసనం గట్టి తీర్పునిస్తూ స్పష్టం చేసింది.

Also Read: 

 

 

తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతో తెలుసా?

 

మన శరీరానికి నిజమైన ఇంజన్ ఆయిల్ ఇదే.. ఈ పోషకం లోపిస్తే అనారోగ్య సమస్యల సునామీ తప్పదు..!!

 

మీకు కొత్తగా చేయూత పింఛన్ మంజూరైందా? మొబైల్‌లోనే ఇలా సులువు

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES