• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /పండగపూట కూల్చివేతలొద్దు.. హైడ్రాకు హైకోర్టు ఆదేశం..

పండగపూట కూల్చివేతలొద్దు.. హైడ్రాకు హైకోర్టు ఆదేశం..

Telangana High Court Serious Warning To Hydraa: దసరా సెలవులైన ఈ నెల 17 నుంచి 25 వరకు కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని కలెక్టర్లు, హైడ్రాకు ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టు... రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 17, 2026, 12:15 PM IST|Updated: Oct 17, 2026, 04:21 PM IST
joinshare
పండగపూట కూల్చివేతలొద్దు.. హైడ్రాకు హైకోర్టు ఆదేశం..
Image Credit: Hydraa (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Garbha dandiya Row: మరీ ఇంత కక్కుర్తీనా..?... దాండియా తర్వాత కుప్పలుగా డ్రెస్‌లు రిటర్న్ పెట్టిన  అమ్మాయిలు.. వీడియో ..

Garbha dandiya Row: మరీ ఇంత కక్కుర్తీనా..?... దాండియా తర్వాత కుప్పలుగా డ్రెస్‌లు రిటర్న్ పెట్టిన అమ్మాయిలు.. వీడియో ..

2

Rain Alert: తెలంగాణ, ఏపీకి చల్లటి కబురు.. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన

3

Uttarakhand: ట్రాఫిక్ పోలీసులతో భయం.. భార్యను రోడ్డు మీద పడేసి భర్త పరుగో పరుగు.. వీడియో వైరల్..

4

Vangaveeti Radha: జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా అతడే!

5

Khammam: నాన్న ఈ చొక్కాలు నీకు బాగుంటాయి.. తండ్రి కళ్ల ముందే కుప్పకూలీన బీటెక్ యువకుడు.. ఖమ్మంలో పెను విషాదం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

HYDRAA: హైదరాబాద్ మహా నగరంలో హైడ్రాకు పట్ట పగ్గాలు లేకుండా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ప్రభుత్వ చెరువులను కబ్జా కోరల నుంచి విడిపిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటుంది. హైడ్రా దూకుడు అదే కొంత మంది నేతల విషయంలో చూసి చూడనట్టు పోవడంపై కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా హైడ్రా అస్మదీయుల విషయంలో ఓ రకంగా .. తస్మదీయుల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని కొంత మంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.  

సంబంధిత వ్యక్తులకు చట్టప్రకారం నోటీసులు జారీ చేయడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టంచేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామంలో తన పట్టా భూమిలోని పశువుల కొట్టాన్ని కూల్చివేయడంతోపాటు భూమిని స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సవాలు చేస్తూ ఎస్‌ లీలావతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు పాస్‌బుకులు, ధరణి పోర్టల్‌లోని వివరాలతోపాటు ఆమె భర్త పేరుతో విద్యుత్తు బిల్లులు కూడా ఉన్నాయని తెలిపారు.

కోర్టులకు సెలవులు ఉన్న టైంలో బాధితులకు చట్టప్రకారం పరిషారం పొందే అవకాశం కూడా ఉండదని తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. దసరా సెలవుల్లో కోర్టు విచారణలో ఉన్న ఆస్తులపై కఠిన చర్యలు తీసుకోకుండా కలెక్టర్లు, హైడ్రాకు ఉత్తర్వులు జారీచేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telugu News
Telangana News