SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Telangana Politics: ఉద్యోగుల డీఏ నుంచి కాళేశ్వరం వరకు..ప్రజల గొంతుకగా జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్!

Telangana Political News: జీ తెలుగు న్యూస్ నిర్వహించిన 'బిగ్ డిబేట్ విత్ భరత్' చర్చా కార్యక్రమంలో తెలంగాణలోని ప్రధాన ప్రజా సమస్యలపై ఎడిటర్ శ్రీ భరత్ సమగ్రంగా విశ్లేషించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, దాని అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు నిర్వీర్యమైన ఈ తరుణంలో జీ తెలుగు న్యూస్ టీవీ ప్రజల వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రధాన ప్రజా వేదికగా మారింది. ఉద్యోగుల పోరాటంతో రెండు డీఏ (DA)ల సాధన, రైతుల దయనీయ పరిస్థితి, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల సమయపరిమితి, కృష్ణా జలాల నిర్వాహణ లోపాలపై జీ తెలుగు న్యూస్ వేదికగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని విశ్లేషకులు కొనియాడారు.

Written By Harish Darla
Published: Oct 04, 2026, 03:32 PM IST | Updated: Oct 04, 2026, 03:39 PM IST
Join

Telangana Political News: ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రధాన ప్రతిపక్షం ప్రజా సమస్యలపై స్పందించడంలో విఫలమైందని జీ తెలుగు న్యూస్ నిర్వహించిన 'బిగ్ డిబేట్ విత్ భరత్' డిబేట్‌లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మాట్లాడకపోతే, కాలక్రమేణా ప్రజలు వారిని పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేస్తూ, నిరంతరం ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక వేదికగా జీ తెలుగు న్యూస్ వ్యవహరిస్తోందని డిబేట్‌లో పాల్గొన్న విశ్లేషకులు స్పష్టం చేశారు.

ఉద్యోగుల డీఏల సాధన, రైతుల దయనీయ స్థితి..
ఉద్యోగులు ఒక సంఘటిత శక్తిగా నిలబడి పోరాడడం వల్ల ప్రభుత్వం నుంచి రెండు డీఏ (DA)లను సాధించుకోగలిగారని తాజాగా జీ తెలుగు న్యూస్ వేదికగా జరిగిన చర్చలో జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ తెలిపారు. అయితే, రైతులు అలా సంఘటితంగా లేకపోవడం వల్ల ఏ ప్రతిపక్ష పార్టీ కూడా వారి సంక్షేమాన్ని జెన్యూన్‌గా పట్టించుకోవడంలేదని డిబేట్ వేదికగా తెలంగాణ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే రైతుల వద్దకు వస్తున్నాయని వారు విమర్శించారు. అయితే ప్రతిపక్ష పాత్రను తెలంగాణ రాష్ట్రంలో జీ తెలుగు న్యూస్ సమగ్రంగా పోషిస్తూ.. ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతుందని కొనియాడారు.

కాళేశ్వరం మరమ్మతులపై ప్రభుత్వ హామీ..
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ఒక టైమ్‌లైన్ విధించుకుంది. అయితే, హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు, ఎన్డీఎస్ఏ (NDSA) ఇచ్చిన కౌంటర్ల వల్లే రాష్ట్ర ప్రభుత్వంపై ఈ బాధ్యత పడిందని విశ్లేషకులు తెలిపారు. ప్రభుత్వం ఈ హామీని ఎంతవరకు చిత్తశుద్ధితో అమలు చేస్తుందో వేచి చూడాల్సి ఉందన్నారు.

కృష్ణా జలాలు, ప్రాజెక్టుల నిర్వహణా లోపాలు..
కృష్ణా నది మొదట ప్రవేశించే జూరాల ప్రాజెక్టు వద్ద నీటిని సరిగా నిల్వ చేసుకునే ఏర్పాట్లు లేకపోవడంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. జూరాల పరిధిలోని 1.20 లక్షల ఎకరాలకే సరిగా నీరివ్వలేని పరిస్థితుల్లో, 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. కర్ణాటక వద్ద కేవలం మూడు టీఎంసీల నీటి కోసం ప్రాధేయపడేకన్నా, మన సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న మిగులు జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES