ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్లో పీఆర్సీ అమలుకు ప్రభుత్వ కసరత్తు..!!
Telangana PRC: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త సంవత్సరంలో శుభవార్త వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పే రివిజన్ కమిషన్ నివేదికను అమలు చేసే దిశగా సర్కార్ కీలక అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
Telangana PRC: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త సంవత్సరంలో శుభవార్త వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పే రివిజన్ కమిషన్ నివేదికను అమలు చేసే దిశగా సర్కార్ కీలక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వచ్చే 2027-28 ఆర్థిక ఏడాది ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీని అమలు చేయాలని సర్కార్ అంతర్గతంగా కసరత్తు చేస్తున్న సమాచారం. దీనిలో భాగంగా.. ప్రస్తుతం నవంబర్ నెల మధ్యలో ఉన్నందున వచ్చే జనవరి నాటికి పీఆర్సీ నివేదికను ప్రభుత్వం తెప్పించుకోనుంది. ఆ తర్వాత నివేదికను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి.. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత తుది రిపోర్టును రూపొందించనున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చలు, సంప్రదింపులు పూర్తి చేసిన తర్వాత.. కొత్త సంవత్సరం కానుకగా ఫిట్మెంట్ తో కూడిన పీఆర్సీ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో .. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందించేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2027 ఫిబ్రవరి రెండో వారం తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఒకసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే పీఆర్సీ ప్రకటించడం సాధ్యం కాదు కాబట్టి.. అంతకుముందే పీఆర్సీని ప్రకటించేందుకు సర్కార్ సిద్థం అవుతున్నట్లు సమాచారం.
గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికల్లో రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల ముందే పీఆర్సీ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతోపాటు.. వారి ఓట్లను సులభంగా పొంది రెండు గ్రాడ్యేయేట్ స్థానాలను కైవసం చేసుకోవచ్చని అధికారి పార్టీ అంచనాలు వేస్తోంది. గతంలో 2021లో ఆనాటి సీఎం కేసీఆర్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు, ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ.. ఎన్నికల ఒత్తిడి లేకుండా ఉద్యోగుల మద్దతు కూడగట్టుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
2027-28 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పీఆర్‌సీ అమలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. గత ప్రభుత్వం ఇప్పటికే 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించగా.. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుది ఫిట్‌మెంట్‌ను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం రెండు డీఏలను విడుదల చేయడంతో ఉద్యోగ వర్గాల్లో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు ఏకంగా 50 శాతం వరకు ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి 1 శాతం ఫిట్‌మెంట్ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా సుమారు రూ. 200 కోట్ల అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది కలిపి 5.20 లక్షల మంది ఉండగా, పెన్షనర్లు మరో 2.94 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు ఏటా రూ. 49,461 కోట్లు, పెన్షన్లకు ఏటా రూ. 13,110 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో ఇది 30.67 శాతంగా ఉంది.
కొత్త పీఆర్‌సీ అమల్లోకి వస్తే బడ్జెట్‌లో జీతభత్యాల వ్యయం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ, ఉద్యోగ సంఘాలను ఒప్పించి ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Also Read: