• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపే లక్ష్యం.. రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ రీడింగ్ డిప్లొమా’ ప్రారంభం.!!

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపే లక్ష్యం.. రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ రీడింగ్ డిప్లొమా’ ప్రారంభం.!!

Telangana Reading Diploma scheme: తెలంగాణ విద్యాశాఖ ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించడంతోపాటు విజ్ఞాన తృష్ణను పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ సరికొత్త అడుగులు వేసింది.

Written ByBhoomi
Published: Oct 28, 2026, 09:55 AM IST|Updated: Oct 28, 2026, 09:57 AM IST
joinshare
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపే లక్ష్యం.. రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ రీడింగ్ డిప్లొమా’ ప్రారంభం.!!
Image Credit: Telangana Reading Diploma scheme

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం..  వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం.. వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

2

సాంసంగ్ Galaxy A08 లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర ఎంతంటే?

3

నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బంపర్‌ జాక్‌పాట్‌!

4

ఆయుష్మాన్ కార్డుదారులకు అలర్ట్.. మీ ఉచిత రూ.5 లక్షల క్లెయిమ్ తిరస్కరిస్తే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

5

పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Reading Diploma scheme: తెలంగాణ విద్యాశాఖ ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించడంతోపాటు విజ్ఞాన తృష్ణను పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ సరికొత్త అడుగులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన దాదాపు 2, 935 సర్కారు బడుల్లో తెలంగాణ రీడింగ్ డిప్లొమా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యాడైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ. 5,803ల నిధులను కేటాయించినట్లు వెల్లడించింది.

కాగా ఈ స్కీమ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతోపాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థులకు కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రత్యేకంగా ముద్రించిన రీడింగ్ పుస్తకాలను ఆయా బడులకు ప్రభుత్వం అందించనుంది.

రీడింగ్ డిప్లొమా అంటే విద్యార్థులు కేవలం పుస్తకాలు చదవడమే కాదు.. పలు సృజనాత్మక పనుల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. పుస్తకం చదివిన తర్వాత అందులోని ప్రధాన చిత్రాన్ని గీసి.. కథా సారాంశాన్ని తన సొంత మాటల్లో క్లుప్తంగా రాయాలి.. అంతేకాదు ఆ పుస్తకాన్ని తోటి స్నేహితులకు చదవమని సూచించాలి.

ఈ విధంగా విద్యార్థులు చదివిన పుస్తకాల సంఖ్య ఆధారంగా బ్రాడ్జీలు.. స్టిక్కర్లు అందించడంతోపాటు ప్రతినెలా పాఠశాల స్థాయిలో రీడింగ్ వేడుకలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా 1, 5,10,15,20,25 పుస్తకాలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి.. వారికి మార్చి 2027 నాటికి నిర్దేశిత వార్షిక లక్ష్యాలు చేరుకున్న విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారిచే అధికారిక డిప్లొమా సర్టిఫికేట్ ను అందిస్తారు. 

ఈ విధంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు రీడింగ్ డిప్లొమా అలవాటు చేసినట్లయితే.. విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తి పెంపొందుతుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. విద్యార్థుల్లో జ్ఞాన సమాజ నిర్మాణానికి ఊతమిచ్చేలా విద్యాశాఖ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

Also Read: 

అర్హులైన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: TSCPSEU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News