SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ.. అక్టోబర్ 28న పాఠశాలల్లో ఈ-వ్యర్థాల సేకరణ డ్రైవ్..!!

E Waste Management Telangana: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అక్టోబర్ 28వ తేదీన ప్రత్యేకంగా ఈ వ్యర్థాల సేకరణ డ్రైవ్ కార్యక్రమం జరగనుంది. కేంద్ర ప్రభుత్వ మిషన్ లైఫ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ నవీన్ నికోలస్ తెలిపారు.

Written By Bhoomi
Published: Oct 23, 2026, 02:10 PM IST | Updated: Oct 23, 2026, 02:13 PM IST
Image Credit: Telangana Schools
Join

E Waste Management Telangana: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అక్టోబర్ 28వ తేదీన ప్రత్యేకంగా ఈ వ్యర్థాల సేకరణ డ్రైవ్ కార్యక్రమం జరగనుంది. కేంద్ర ప్రభుత్వ మిషన్ లైఫ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు  సమగ్ర శిక్ష ఎస్పీడీ నవీన్ నికోలస్ తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై ఆలోచనలు పెంచేందుకు ఈ డ్రైవ్ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలు తమ ఇళ్లలోని పాత ఎలక్ట్రానిక్ వస్తువులను పాఠశాలకు తీసుకురావాలని అధికారులు సూచించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా, వారు ఆ పరికరాలను విడదీయకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉపాధ్యాయులు అత్యంత జాగ్రత్త వహించాలి.

ఇ-వ్యర్థాల సేకరణ రోజులలో పాఠశాలల్లో పిల్లల కోసం క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా పర్యావరణ సమస్యలపై వారిలో అవగాహన పెరుగుతుంది. ఆ రోజు సేకరించిన సమాచారాన్ని సంబంధిత అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించడం జరిగింది.

పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ,  పునర్వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పాఠశాలల్లో 4 విభిన్న రంగుల డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసి చెత్తను క్రమబద్ధీకరించనున్నారు.

పచ్చని డస్ట్‌బిన్ (తడి వ్యర్థాలు): 
త్వరగా కుళ్ళిపోయే స్వభావం కలిగిన జీవ వ్యర్థాలైన ఆహార అవశేషాలు, కూరగాయల తొక్కలు, తోటమాలీ వ్యర్థాలు మొదలైనవి ఇందులో వేయాలి.  

నీలం డస్ట్‌బిన్ (పొడి వ్యర్థాలు): 
పునర్వినియోగించగల (Recyclable) కాగితం, కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్, లోహం, గాజు వస్తువులు మొదలైనవి.  

పసుపు/ఎరుపు డస్ట్‌బిన్ (పారిశుధ్య వ్యర్థాలు): 
డయాపర్లు, శానిటరీ ప్యాడ్లు, టిష్యూలు, మాస్కులు మొదలైన పారిశుధ్య ఉత్పత్తులను సురక్షితంగా మూసి ప్యాకింగ్ చేసి వేయాలి.  

నలుపు డస్ట్‌బిన్ (ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలు / ఈ-వ్యర్థాలు): 
ఇంటి ప్రమాదకర వ్యర్థాలు, పాత బ్యాటరీలు, మోబైళ్లు, చార్జర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ట్యూబ్ లైట్లు, పాత విద్యుత్ వస్తువులు సేకరించాలి.  

ఈ-వ్యర్థాలు అంటే ఏమిటి?
పాఠశాలల్లో గానీ, ఇళ్లలో గానీ ఇకపై ఉపయోగించని, పాడైన లేదా పనిచేయకుండా మూలనపడ్డ విద్యుత్,  ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ ఈ-వ్యర్థాలు (E-Waste) గా పరిగణిస్తారు.   పాడైన కంప్యూటర్లు, మానిటర్లు, ల్యాప్‌టాప్‌లు   మొబైల్ చార్జర్లు, డేటా కేబుళ్లు, ఇయర్ ఫోన్లు   కీబోర్డ్, మౌస్, క్యాలిక్యులేటర్లు, అడాప్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు   వీటిని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా తప్పనిసరిగా నల్ల రంగు డస్ట్‌బిన్లోనే వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.  

పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలు - UDISE నమోదు విధానం:
ప్రతి పాఠశాలలో ఈ-వ్యర్థాల సేకరణ కోసం తప్పనిసరిగా ఒక నల్ల రంగు డస్ట్‌బిన్‌ను సిద్ధం చేయాలి.   పాఠశాల కాంపాస్ నుండి గానీ, విద్యార్థుల ఇళ్ల నుండి గానీ ఉపయోగించని ఈ-వ్యర్థాలను సేకరించాలి.   సేకరించిన వస్తువుల సంఖ్యను లెక్కించి, వివరాలను నమోదు చేసుకుని ఫోటోలు తీయాలి.   UDISE కోడ్ ఉపయోగించి https://ecoclubs.education.gov.in వెబ్‌సైట్‌లో పోర్టల్ లాగిన్ అయి అప్‌లోడ్ చేయాలి.   పోర్టల్‌లో ఇచ్చిన 5 చిన్న ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇచ్చి..  2 నుండి 3 జియోట్యాగ్ చేసిన ఫోటోలను అప్‌లోడ్ చేయాలి.   అక్టోబర్ 28వ తేదీన  ఈ-వ్యర్థాల అవగాహనా దినోత్సవం సందర్భంగా పాఠశాల ఉదయం ప్రార్థన (Assembly) సమయంలో విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.  

Also Read:  

టీడీఆర్ సేవలకు ఆధార్ అథెంటికేషన్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవే!

పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధరలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES