• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /గుడ్ న్యూస్.. దసరాకు 13 రోజుల సెలవులు.. స్కూల్స్ ఎప్పటి నుంచి తెరుస్తారంటే?

గుడ్ న్యూస్.. దసరాకు 13 రోజుల సెలవులు.. స్కూల్స్ ఎప్పటి నుంచి తెరుస్తారంటే?

Vijayadashami Holidays Telangana: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. స్కూల్స్‌కి దాదాపు 13 రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెల్లడైంది.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 03, 2026, 10:39 AM IST|Updated: Oct 03, 2026, 10:41 AM IST
joinshare
గుడ్ న్యూస్.. దసరాకు 13 రోజుల సెలవులు.. స్కూల్స్ ఎప్పటి నుంచి తెరుస్తారంటే?
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తమిళనాడులో సైన్‌బోర్డుపై హిందీ పదాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్!

తమిళనాడులో సైన్‌బోర్డుపై హిందీ పదాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్!

2

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా పండగకు ముందే DA పెంపుపై ప్రకటన...ఈ సారి 64 శాతం వరకూ పెరిగే ఛాన్స్..?

3

గుడ్ న్యూస్.. దసరాకు 13 రోజుల సెలవులు.. స్కూల్స్ ఎప్పటి నుంచి తెరుస్తారంటే?

4

అక్టోబర్ 3 నుంచి కేతువు సంచారం.. ఈ 3 రాశులవారికి ఆర్థిక కష్టాలు, కుటుంబంలో కలహాలు!

5

బొల్లారం మిలిటరీ కేసులో దిగ్భ్రాంతికర నిజాలు.. విదేశీ శక్తులకు సైనిక తుపాకులు! ఢిల్లీ ఇంటెలిజెన్స్ రంగంలోకి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Dasara Holidays 2026 News: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ అద్భుతమైన శుభవార్తను అందించింది.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకతకలిగిన బతుకమ్మ, విజయదశమి పండుగల నేపథ్యంలో పాఠశాలలకు ఊహించని విధంగా సెలవులను ఖరారు చేస్తూ.. విద్యాశాఖ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఇక సెలవు వివరాల్లోకి వెళితే..

ఈ విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు అమల్లో ఉంటాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.. అనంతరం అక్టోబర్ 23వ తేదీన పాఠశాలలు యథావిధిగా తిరిగి తెరుచుకోబోతున్నట్లు తెలిపారు.

ఈ సెలవులు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌తో పాటు మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేట్, కార్పొరేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలకు సమానంగా వర్తిస్తాయని అధికారు తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలతో పాటు ఆ తర్వాత వచ్చే దసరా పండుగను విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేలా ఈ సెలవుల క్యాలెండర్‌ను రూపొందించిన్నట్లు తెలుస్తోంది..

సెలవుల సమయాల్లో విద్యార్థులపై అనవసరమైన అకడమిక్ భారం పడకుండా ప్రాజెక్ట్ పనులు లేదా పరీక్షల ఒత్తిడి తీసుకురావద్దని.. పండుగ వాతావరణాన్ని పిల్లలు ఆస్వాదించేలా చూడాలని అధికారులు టీచర్స్‌కి సూచించిన్నట్లు తెలుస్తోంది..

ఇదిలా ఉంటే.. దసరా సెలవుల సమయంలో ప్రైవేట్‌తో పాటు కార్పొరేట్ యాజమాన్యాలు ఎలాంటి స్పెషల్ క్లాసులతో పాటు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కోచింగ్‌లు నిర్వహించడానికి వీల్లేదని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించి సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే.. తప్పకుండా ఆ స్కూల్స్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను (DEO) ఆదేశించింది. క్షేత్రస్థాయిలో నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు పర్యవేక్షించబోతున్నట్లు కూడా తెలుస్తోంది.

వరుసగా 13 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు లభించడంతో నగరాలతో పాటు పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబాలు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్లాన్స్‌లు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.. అక్టోబర్ 22తో సెలవులు ముగియనుండగా.. 23వ తేదీ ఉదయం నుంచి మళ్లీ ఎప్పటి లాగే రెగ్యులర్ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
School Holiday
Telugu News