తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..
Telangana Toofan Effect: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Telangana Rains: ఆర్నబ్ తుపాను ఎపెక్ట్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో బలపడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
ఈ రోజు అల్ప పీడనం, వాయు గుండంగా (Depression) మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, అక్టోబర్ 25వ తేదీన తీవ్ర వాయు గుండంగా (Deep Depression) మారనుంది. ఇక అక్టోబర్ 26వ తేదీ ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా (Cyclonic Storm) బలపడే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఆ తరువాత కూడా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతూ.. అక్టోబర్ 28 ఉదయం సమయానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.