SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kavitha Vs KTR: గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి కేసీఆర్‌పై విమర్శలా..?.. కేటీఆర్ టార్గెట్ గా కవిత సెన్సెషనల్ కామెంట్స్..

Kavitha fires on ktr: నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఒక రైతు ఫోన్ మాట్లాడుతుంటే "నీ పెండ్లామా!? అంత అర్జెంటా!?.. అంటూ అహంకారంతో అతని భార్యనే అవమానించారని కవిత సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Written By Inamdar Paresh
Published: Sep 29, 2026, 02:28 PM IST | Updated: Sep 29, 2026, 02:34 PM IST
Image Credit: kavitha(file)
Join

Trs chief Kalvakuntla Kavitha fires on brs ktr: తెలంగాణ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కవిత తనదైన చాణక్యంతో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీని, మరోవైపు బీఆర్ఎస్  ను విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ది ప్యారడైజ్ మూవీపై కూడా కవిత విమర్శలు చేశారు. దీనిలో మాజీ సీఎం కేసీఆర్ ను అవమానించారని అన్నారు. అంతే కాకుండా.. డబ్బులిచ్చి మరీ ఈ పాటలకు వినాయక నిమజ్జనంలో డ్యాన్స్ లు చేయిస్తున్నాంటూ ఏకీపారేశారు.  తాజాగా.. మరోసారి కల్వకుంట్ల కవిత .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పదునైన విమర్శలు చేశారు. 

ముఖ్యంగా ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ఎమ్మెల్యేలను నియోజక వర్గంకు సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కారణమని, నియోజక వర్గాల్లో ఇతరులు జోక్యం చేసుకొవద్దని తమ అధినేత ఆదేశించారని  కేటీఆర్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై కవిత తాజాగా.. కౌంటర్ ఇచ్చారు.

నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారని కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?.. అంటూ ప్రశ్నలు సంధించారు.

మీ పార్టీ అధినేత కేసీఆర్ గారిని విమర్శించడం.. ఆయన తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!?.. అంటూ మండిపడ్డారు. మీ ఫామ్ హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న జరిగిన బీఆర్ఎస్ మీటింగులో ఒక రైతు ఫోన్ మాట్లాడుతుంటే "నీ పెండ్లామా!? అంత అర్జెంటా!? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారు.." "ఒక మహిళా సాయం కోరి వస్తే నా కోసం కన్నావా" అని అమ్మనే అవమానించారని శివాలెత్తిపోయారు.

గుంటనక్క మైండ్ గేమ్  లో బ్లైండ్ గా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్.. బీఆర్ఎస్ కు  గోతిని తవ్వుతున్నావ్ అంటూ కవిత విమర్శించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే... ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా?.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా influencers ను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసంటూ దుయ్యబట్టారు. నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు!.. కేటీఆర్ అంటూ కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES