• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Rains in Telangana: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Rains in Telangana: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Imd heavy rain alert for Telangana: తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని ఐఎండీ బులెటిన్‌లో స్పష్టం చేసింది

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 20, 2026, 08:25 PM IST|Updated: Sep 20, 2026, 08:33 PM IST
joinshare
Rains in Telangana: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
Image Credit: Telanganainupdate(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Weather Update Heavy rain alert for Telangana: తెలంగాణలో గత కొన్నిరోజులుగా కుండపోతగా వర్షంపడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలుజిల్లాల్లో భారీగా వర్షం కురుస్తుంది. అయితే.. తాజాగా..ఐఎండీ మరోసారి కీలక అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో  రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. 

పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని బిగ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని అధికారులు కీలక సూచనలు చేశారు. 

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి వర్షం దంచికొడుతుందని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. 

ముఖ్యంగాఉత్తర తెలంగాణలోని పలుజిల్లాల్లో, భారీగా వానలు కురవడంతో పాటు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. గడిచిన 24 గంటల్లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అత్యధికంగా 12.9 సెం.మీ.ల వర్షం, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు సమాచారం.  ముఖ్యంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిఅధికారులుసూచిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Telugu News
Weather Update