• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /భారత్ సమ్మిట్‌కు భాగ్యనగరం ముస్తాబు.. ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ..

భారత్ సమ్మిట్‌కు భాగ్యనగరం ముస్తాబు.. ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ..

Bharat Summit: టెక్నాలజీ, పారిశ్రామిక, సాంస్కృతిక రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారుతున్న భాగ్యనగరం హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదికవుతోంది. భారత్ సమ్మిట్ నగరంలోని ప్రఖ్యాత హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజుల పాటు జరగనుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 12, 2026, 08:57 AM IST|Updated: Nov 12, 2026, 09:04 AM IST
joinshare
భారత్ సమ్మిట్‌కు భాగ్యనగరం ముస్తాబు.. ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ..
Image Credit: Bharat Summit (ZEE Telugu News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
చిరు వ్యాపారులకు తీపి కబురు.. ముద్ర, స్టాండ్-అప్ ఇండియా పథకాలపై మోదీ సర్కార్  కీలక నిర్ణయం..!!

చిరు వ్యాపారులకు తీపి కబురు.. ముద్ర, స్టాండ్-అప్ ఇండియా పథకాలపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం..!!

2

పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ 5 రూల్స్ తెలియకపోతే రూ. 10,000 జరిమానా కట్టాల్సిందే!

3

ఫ్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన రజినీకాంత్ ‘జైలర్ 2’..

4

ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్‎లో పీఆర్‌సీ అమలుకు ప్రభుత్వ కసరత్తు..!!

5

భారత్ సమ్మిట్‌కు భాగ్యనగరం ముస్తాబు.. ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hyderabad Bharat Summit: భారత్‌ సమ్మిట్‌కు 70కి పైగా దేశాల నుంచి వివిధ రంగాల నిపుణులు, విధానకర్తలు, రాజకీయ ప్రముఖులు, మేధావులు రానున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ నాయకత్వంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇక లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు ఈ సమిట్‌లో చర్చలు జరుగుతాయని వెల్లడించారు.

వెయ్యి మంది వరకూ నిపుణులు, పాలసీ మేకర్లు, పెట్టుబడిదారులు ఈ సమిట్‌కు రాబోతున్నారు. వారందరి అభిప్రాయాలు తీసుకుని... తెలంగాణ అభివృద్ధికి వారి ఆలోచనలను, అనుభవాలను ఉపయోగించుకోబోతున్నట్టు తెలిపారు. త్వరలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌కు కూడా ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ఆర్థిక విధానాలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను పెట్టుబడిదారులకు వివరిస్తామని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రపంచ దక్షిణ దేశాల సహకారం, సాంకేతికత, కృత్రిమ మేధ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, యువత, లింగ సమానత్వం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ జర్నలిజం వంటి 12 కీలక అంశాలపై ఈ సమ్మిట్‌లో చర్చించనున్నారు. సమ్మిట్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీలు హాజరయ్యే అవకాశం ఉంది.

రాహుల్ గాంధీ హాజరు..

గతేడాది తెలంగాణలో నిర్వహించిన భారత్‌ సమిట్‌ విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది కూడా సమిట్‌ను నిర్వహిస్తున్నట్టు సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలిపారు. కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా విద్వేషపూరిత రాజకీయాలు పెరిగాయి. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ విద్వేష రాజకీయాలను సమర్థంగా ఎదుర్కొంటూ, సానుకూల రాజకీయాలకు పునరుజ్జీవం పోస్తోందని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి అని గుర్దీప్‌సింగ్‌ సప్పల్‌ తెలిపారు.


పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ రాహుల్‌గాంధీని ఆయన నివాసంలో కలిసి భారత్‌ సమిట్‌కు ఆహ్వానించారు. రాహుల్‌గాంధీ భారత్‌ సమిట్‌కు హాజరవుతారని... ఈ సందర్భంగా సర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.  మెగా బీసీ ర్యాలీనీ నిర్వహించాలనీ యోచిస్తున్నామని తెలిపారు. భారత్‌ సమిట్‌లో పాల్గొన్న అనంతరం గిగ్‌ వర్కర్లతో సమావేశం నిర్వహించాలని రాహుల్‌గాంధీ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గిగ్‌ వర్కర్ల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం గురించి వారితో రాహుల్‌గాంధీ మాట్లాడతారని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

ప్రియాంక గాంధీ ప్రసంగం.. 
రేపు భారత్‌ సమ్మిట్‌లో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు. నావిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్- వ్యూ ఫ్రమ్ ఇండియా’ అంశంపై ఆమె ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల ప్రస్థానం, సమాచార హక్కు, ఉపాధి హామీ వంటి చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎక్స్‌పో ప్రారంభమవుతుంది. అనంతరం జరిగే అంతర్జాతీయ సెషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ క్యాపిటలిజం, వాతావరణ మార్పులు, బహుళపక్ష సంస్థల సంస్కరణలు, లింగ సమానత్వంపై చర్చలు ఉంటాయి. ఇందులో ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టి, జయతి ఘోష్, నెదర్లాండ్స్ మాజీ మంత్రి బెర్ట్ కోయెండర్స్, రేణుకా చౌదరి తదితరులు పాల్గొంటారు.

మరోవైపు, హైటెక్స్ వేదికగా జరిగే ‘తెలంగాణ రైజింగ్’ సెషన్లలో ఫ్యూచర్ సిటీ, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తదితరులు చర్చిస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.

శనివారం ముగియనున్న సమ్మిట్..

చివరి రోజైన శనివారం ఉదయం సమాఖ్య వ్యవస్థ, తెలంగాణ సంస్కృతి, ఎన్నికల సమగ్రత, మీడియా భవిష్యత్, ప్రపంచ శాంతి వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. వీటిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్, వినేశ్ ఫోగట్, సచిన్ పైలట్, మనీష్ తివారీ, జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తదితరులు పాల్గొంటారు. అనంతరం డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ పేరుతో ముగింపు సభ జరుగుతుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వాగతోపన్యాసం చేయనుండగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కీలకోపన్యాసం చేస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రగతిశీల శక్తుల కోసం అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించి, సమిట్ తీర్మానాన్ని ఆమోదిస్తారు. 15న ప్రతినిధుల ద్వైపాక్షిక సమావేశాలు, తిరుగు ప్రయాణాలతో సదస్సు ముగయనుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Congress
Rahul Gandhi
Revanth Reddy
Telangana News