• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ 5 రూల్స్ తెలియకపోతే రూ. 10,000 జరిమానా కట్టాల్సిందే!

పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ 5 రూల్స్ తెలియకపోతే రూ. 10,000 జరిమానా కట్టాల్సిందే!

సాధారణంగా పాన్‌ కార్డు అనేది ఆధార్‌ కార్డు మాదిరి తప్పనిసరిగా మారిపోయింది. ఏ ఆర్థిక లావాదేవీలు చేసినా ఈ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్న్‌ సబ్మిట్‌ చేయాలన్నా పాన్‌ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. అయితే, ఈ పాన్‌ కార్డుకు సంబంధించిన ఈ 5 రూల్స్‌ తెలియకపోతే మీరే నష్టపోతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 12, 2026, 09:32 AM IST|Updated: Nov 12, 2026, 10:35 AM IST
joinshare
పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ 5 రూల్స్ తెలియకపోతే రూ. 10,000 జరిమానా కట్టాల్సిందే!
Image Credit: PAN Card Rules Update:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

2

సంక్రాంతి ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నవంబర్ 14 నుంచే టికెట్ రిజర్వేషన్లు, తేదీలివే!

3

అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!

4

చిరు వ్యాపారులకు తీపి కబురు.. ముద్ర, స్టాండ్-అప్ ఇండియా పథకాలపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం..!!

5

పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ 5 రూల్స్ తెలియకపోతే రూ. 10,000 జరిమానా కట్టాల్సిందే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PAN Card Rules Update: ఏ ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా పాన్‌ కార్డు తప్పనిసరి. బ్యాంకు ఇతర ఫైనాన్షియల్‌ లావాదేవీలు చేయాలన్నా పాన్‌ కార్డు కావాల్సిందే. ఆదాయపు పన్ను రిటర్న్‌ సబ్మిట్‌ చేయడానికి కూడా ఇది ఒక కీలక టూల్‌. పాన్‌ కార్డు ద్వారా స్థిరాస్తులు కొనుగోలు, వెహికల్‌, స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులకు కూడా ఇది కీలకంగా మారింది. ఈ పాన్‌ కార్డు నెంబర్‌ ఆధారంగానే ఆదాయపు పన్ను శాఖ వారు ఒక వ్యక్తి లావాదేవీలను మానిటర్‌ చేస్తారు. అందుకే ఎక్కడైనా పాన్‌ కార్డు ఇచ్చినప్పుడు తప్పులు లేకుండా చూడాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. పాన్‌ కార్డు ఉన్న ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 ఇవే..

ఆస్తుల లావాదేవీలు..
ఏదైనా ఆస్తులు కొనుగోలు లేదా విక్రయాలు జరపాలన్నా పాన్‌ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. ఏదైనా ఇల్లు, దుకాణం, ల్యాండ్‌ రూ.20 లక్షలకు మించితే పాన్‌ కార్డు తప్పనిసరిగా సబ్మిట్‌ చేయాలని గుర్తుంచుకోండి.

వస్తువులు, సేవలు.
వస్తువులు, సేవలు రూ.2 లక్షల కంటే ఎక్కువగా క్రయవిక్రయాలు జరిపినా ఇది తప్పనిసరి.

ఇవి మాత్రమే కాదు.. కొన్ని లిస్ట్‌ కాని షేర్స్‌ ఉంటాయి. రూ.1 లక్ష విలువ చేసే లిస్ట్‌ కాని షేర్స్‌కు కూడా పాన్‌ కార్డు తప్పనిసరి.

వెహికల్‌..
ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలంటే రూ.5 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే పాన్‌ కార్డు తప్పనిసరి. అంటే కారు కొనుగోలు చేస్తే తప్పనిసరిగా పాన్‌ కార్డు సబ్మిట్‌ చేయండి. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలకు డీమ్యాట్‌ ఖాతా ఓపెనింగ్‌కు కూడా పాన్‌ కార్డు కావాల్సిందే. మ్యూచువల్‌ ఫండ్స్‌కు, పెట్టుబడులకు తప్పనిసరిగా మారింది.

పాన్‌ కార్డు సబ్మిట్‌ చేయకపోతే ఏం జరుగుతుంది?
పాన్‌ కార్డు సబ్మిట్‌ చేయకపోతే ఏదైనా బిజినెస్‌ లేదా సంస్థలు తిరస్కరించే అవకాశం ఉంది. పాన్‌ కార్డు ద్వారా మీ లావాదేవీలు టీడీఎస్‌, టీసీఎస్‌, ఎస్‌ఎఫ్‌టీ, ఏఐఎస్‌ చానల్‌ ద్వారా ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందుతుంది. మీరు రిపోర్టు చేసిన ఆదాయం కంటే ఎక్కువ లావాదేవీలు జరిగిపితే మీకు నోటీసు జారీ చేస్తారు.

Read Also: Video: వందే భారత్ స్లీపర్‌లో టికెట్ ప్రింట్ తీసుకెళ్లకపోతే ఫైన్ పడుతుందా? రూల్స్‌ ఇవే..!!

Read Also: నెలవారీ రీఛార్జ్ గోల లేదు.. 365 రోజులకు కేవలం రూ.2399 మాత్రమే! BSNL బంపర్ ప్లాన్ వివరాలివే!
 

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.10000 సరైన పాన్‌ కార్డు సబ్మిట్‌ చేయకపోతే విధిస్తారు. తప్పుడు సమాచారం వల్ల మీ ఫైనాన్షియల్ రికార్డులపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే మీ అన్ని బ్యాంకు ఖాతాల్లో మీ పాన్‌ కార్డు వివరాలను సరిగ్గా నమోదు చేయండి.

పాన్‌ కార్డు ఒక యూనిక్‌ ఐడెంటిఫైయర్‌ లా పనిచేస్తుంది. బ్యాంక్‌ డిపాజిట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు, స్థిరాస్తుల కొనుగోళ్లు పాన్‌తో ముడిపడి ఉంటాయి. ఆదాయపు పన్ను శాఖ వారు ఇవన్నీ క్రాస్‌ చెక్‌ చేస్తూ ఉంటారు.అందుకే మీరు ఏ ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా పాన్‌ కార్డు వివరాలు సరిగ్గా ఉన్నాయా? చెక్‌ చేసుకోండి.

Add Zee News as a Preferred Source
TAGS:
Pan Card
National News
Income Tax
Telugu News