• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /చిరు వ్యాపారులకు తీపి కబురు.. ముద్ర, స్టాండ్-అప్ ఇండియా పథకాలపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం..!!

చిరు వ్యాపారులకు తీపి కబురు.. ముద్ర, స్టాండ్-అప్ ఇండియా పథకాలపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం..!!

Schemes: దేశంలోని చిరు వ్యాపారులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న వ్యాపారులతోపాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Written ByBhoomi
Published: Nov 12, 2026, 09:41 AM IST|Updated: Nov 12, 2026, 09:43 AM IST
joinshare
చిరు వ్యాపారులకు తీపి కబురు.. ముద్ర, స్టాండ్-అప్ ఇండియా పథకాలపై మోదీ సర్కార్  కీలక నిర్ణయం..!!
Image Credit: Schemes:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

2

సంక్రాంతి ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నవంబర్ 14 నుంచే టికెట్ రిజర్వేషన్లు, తేదీలివే!

3

అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!

4

చిరు వ్యాపారులకు తీపి కబురు.. ముద్ర, స్టాండ్-అప్ ఇండియా పథకాలపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం..!!

5

పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ 5 రూల్స్ తెలియకపోతే రూ. 10,000 జరిమానా కట్టాల్సిందే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Schemes: దేశంలోని చిరు వ్యాపారులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న వ్యాపారులతోపాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్ధిక భరోసా  కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రెండు ప్రతిష్టాత్మక లోన్ స్కీమ్స్ గడువును మరో 5ఏళ్ల పాటు పొడిగిస్తూ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం.. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద కొనసాగుతున్న క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్, స్టాండ్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ను 2031 మార్చి 31 వరకు అమలు చేయనున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే సులభంగా లోన్స్ అందించి.. న్యూ జనరేషన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్త్రుతం చేయడమే లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ పొడిగింపులో భాగంగా, ముద్రా పథకం కింద రుణ హామీల కోసం కేబినెట్ రూ. 5,000 కోట్ల నిధిని ఆమోదించింది. ఈ పథకం రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు రూ. 12.6 లక్షల కోట్ల విలువైన రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హామీ ఇప్పుడు రూ.20 లక్షల వరకు సూక్ష్మ సంస్థలకు, జన్ ధన్ ఖాతాలలో రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలకు.. స్వయం సహాయక బృందాలకు రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల మధ్య రుణాలకు వర్తిస్తుంది. లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు, ముద్రా రుణాలపై వార్షిక హామీ రుసుమును 1శాతం నుండి 0.75శాతానికి తగ్గించారు.

అదేవిధంగా..స్టాండ్-అప్ ఇండియా పథకాన్ని 2031 వరకు పొడిగించారు. దీని కోసం రూ.4,111 కోట్ల రుణ హామీ నిధిని కేటాయించారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.20 లక్షల వరకు రుణాలు, అలాగే రూ.1 కోటి వరకు రుణాలు అందించబడతాయి. ఈ పథకం కింద ఇప్పటికే 2.75 లక్షల మంది లబ్ధి పొందగా, రాబోయే ఐదేళ్లలో మరో 2.5 లక్షల మందికి సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కేబినెట్ నిర్ణయాల గురించి మీడియాకు తెలియజేస్తూ.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ చర్యలు రుణ సంస్థలపై భారాన్ని తగ్గిస్తాయని, కొత్త పారిశ్రామికవేత్తలు రుణాలు పొందడాన్ని సులభతరం చేస్తాయని అన్నారు. ఇంతకుముందు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న వర్గాలను తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేలా ఈ నిర్ణయాలు ప్రోత్సహిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Also Read: 

ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్‎లో పీఆర్‌సీ అమలుకు ప్రభుత్వ కసరత్తు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
Business News
PM Modi