Bismil Ki Mehfil India Tour In Hyderabad: సూఫీ సంగీతం.. సాహిత్యానికి విశేష కృషి చేస్తున్న గాయకుడు, కవి బిస్మిల్ దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. జీ లైవ్ ఆధ్వర్యంలో బిస్మిల్ కీ మెఫ్ఫీల్ పేరిట జరుగుతున్న ఇండియా టూర్‌లో భాగంగా బిస్మిల్ హైదరాబాద్‌లో పర్యటించబోతున్నాడు. సూఫీ సంగీతానికి విశేష ఆదరణ కలిగిన హైదరాబాద్‌లో బిస్మిల్ కన్సర్ట్ చేయబోతున్నాడు. అత్యంత ఆసక్తికరమైన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
'బిస్మిల్ కీ మెహ్ఫిల్' ఇండియా టూర్‌లో భాగంగా బిస్మిల్ నవంబర్ 28వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. నగర ప్రజల హృదయాలను హత్తుకునే సంగీతం, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమానికి హైదరాబాద్ ముస్తాబమవుతోంది. జీ లైవ్ ప్రధాన లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాపర్టీ సూపర్‌మూన్ సమర్పిస్తున్న ఈ కచేరీ సూఫీ కవిత్వంలోని భావోద్వేగ లోతును, శక్తివంతమైన గాత్రాన్ని, సమకాలీన సంగీతాన్ని ఏకం చేసి ప్రేక్షకులకు మధురామైన అనుభూతి కలగనుంది.
సాంప్రదాయ సూఫీ ప్రభావాలను ఆధునిక సంగీత అమరికలతో మేళవిస్తూ 'బిస్మిల్ కీ మెహ్ఫిల్' ఈ ప్రక్రియలోని కవిత్వం, భావోద్వేగాన్ని సమకాలీన కచేరీ రూపంలోకి తీసుకువస్తుంది. బిస్మిల్ విలక్షణమైన గాత్రంతో హైదరాబాద్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయనున్నాడు. ఉత్సాహభరితమైన సంగీత క్షణాలు.. ప్రేక్షకులను పాటల్లో భాగంగా చేసేలా ఈ కన్సర్ట్ కొనసాగనుంది. కన్సర్ట్‌కు హాజరైన ప్రేక్షకులు కూడా సూఫీ సంగీతంలో మునిగితేలనున్నారు.
నగర ప్రేక్షకుల నుంచి సూఫీ సంగీతానికి విశేష ఆదరణ ఉండడంతో బిస్మిల్ కీ మెఫ్ఫీల్ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది. సాయంకాలం వేళ ఆహ్లాదకర వాతావరణంలో సూఫీ సంగీతం వింటూ మధరానుభూతి పొందనున్నారు. విభిన్న సంగీత సంప్రదాయాలకు ఆదరణకు గుర్తింపుపొందిన హైదరాబాద్‌లో బిస్మిల్ పర్యటన విజయవంతమయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో జరగనున్న బిస్మిల్ కీ మెఫ్ఫీల్ షో గురించి జీ లైవ్ బిజినెస్ హెడ్ గారెత్ ఎస్విన్ థామస్ కీలక వివరాలు వెల్లడించారు. 'హైదరాబాద్‌కు సంగీతం, సంస్కృతి, కళాత్మక వ్యక్తీకరణపై చక్కటి ఆదరణ ఉంది. 'బిస్మిల్ కీ మెహ్ఫిల్'తో మేము సూఫీ సంగీత వైభవాన్ని చాటిచెబుతూనే.. దానికి సమకాలీన లైవ్ కచేరీ అందిస్తున్నాం. ఇండియా టూర్‌లో భాగంగా సూఫీ సంగీత అనుభూతిని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. శక్తివంతమైన సంగీతం, ప్రేక్షకులతో అనుసంధానమయ్యే సాయంత్రం కోసం ఎదురుచూస్తున్నాం' అని వివరించారు.
గాయకుడు, రచయిత బిస్మిల్ తన హైదరాబాద్ పర్యటనపై స్పందిస్తూ.. ''హైదరాబాద్ నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. నేను ఇక్కడ ప్రదర్శన ఇచ్చిన ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమను తిరిగి పొందాను. బిస్మిల్ కీ మెఫ్ఫీల్‌తో తిరిగి రావడం సంతోషంగా ఉంది. నా దృష్టిలో మెఫ్ఫీల్ అంటే సంగీతం, కవిత్వం, భావోద్వేగాలను వాటి స్వచ్ఛమైన రూపంలో పంచుకోవడం. ప్రతి బాణీ ప్రతిధ్వనించే, ప్రతి పంక్తి హృదయాన్ని తాకే వాతావరణాన్ని సృష్టించడమే దీని ఉద్దేశం. హైదరాబాద్‌తో మరిన్ని అందమైన జ్ఞాపకాలను పంచుకోవడానికి నేను ఎదురుచూస్తున్నా'' అని వెల్లడించారు.
బిస్మిల్ కీ మెఫ్ఫీల్ ఇండియా టూర్ నవంబర్ 1వ తేదీన పూణేలో ప్రారంభమైంది. నవంబర్ 14న జైపూర్‌లో జరగ్గా.. నవంబర్ 28న హైదరాబాద్‌కు చేరుకోనుంది. అనంతరం డిసెంబర్ 24న ఇండోర్, జనవరి 26వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇక ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ పర్యటనలకు సంబంధించి తేదీలు ఇంకా ఖరారు కాలేదు. త్వరలో వీటి తేదీలు ప్రకటించనున్నారు.
'బిస్మిల్ కీ మెహ్ఫిల్' ఎప్పుడు, ఎక్కడ
తేదీ: శనివారం, 28 నవంబర్
సమయం: రాత్రి 8:30 గంటలకు
వేదిక: క్వేక్ అరీనా, కొండాపూర్, హైదరాబాద్
టికెట్ ధర: రూ.1,299 నుంచి ప్రారంభం
టికెట్ల బుకింగ్: బుక్‌మైషో
జీ లైవ్ గురించి
బిస్మిల్ కీ మెఫ్ఫీల్ ఇండియా టూర్‌ను జీ లైవ్ అందిస్తోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీల్)కు చెందిన లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఈవెంట్స్ వ్యాపార విభాగం జీ లైవ్. జీ లైవ్ సంగీతం, కామెడీ, కళ, సంస్కృతి, కవిత్వం రంగాలలో లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు అందిస్తోంది. జీ లైవ్‌లో భాగంగా సూపర్‌మూన్ (Supermoon), అర్థ్ – ఏ కల్చర్ ఫెస్ట్ (Arth – A Culture Fest), ఇండియా షాయరీ ప్రాజెక్ట్ (India Shayari Project), ఇట్స్ ఎ గర్ల్ థింగ్ ఇండియా (It’s a Girl Thing India) ఉన్నాయి.
సూపర్‌మూన్ గురించి
జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)లో అందిస్తున్న సూపర్‌మూన్ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఈవెంట్స్ అందించే ఒక వేదిక. సంగీతం, కామెడీ, థియేటర్ రంగాలలో విస్తరించి.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాలను అందిస్తోంది.