• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Vaibhav Sooryavanshi Records: ఒకే ఇన్నింగ్స్‌తో 7 ప్రపంచ రికార్డులు.. వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఇదే..!

Vaibhav Sooryavanshi Records: ఒకే ఇన్నింగ్స్‌తో 7 ప్రపంచ రికార్డులు.. వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఇదే..!

Vaibhav Sooryavanshi Top Records: వయసు పదిహేనేళ్లే.. కానీ గ్రౌండ్‌లో బ్యాట్ పట్టుకుని దిగాడంటే ఎంతటి బౌలర్‌కు అయినా చెమటలు పట్టాల్సిందే. బంతి ఎలా వేసినా బౌండరీ దాటించడమే టార్గెట్‌గా వీర విధ్వంసం సృష్టిస్తాడు. ఇప్పటికే ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లతో రికార్డుల కొల్లగొడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు ఒకే మ్యాచ్‌తో ఏకంగా ఏడు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Written ByAshok Krindinti
Published: Nov 24, 2026, 20:05 IST|Updated: Nov 24, 2026, 20:07 IST
joinshare
Vaibhav Sooryavanshi Records: ఒకే ఇన్నింగ్స్‌తో 7 ప్రపంచ రికార్డులు.. వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఇదే..!
Image Credit: Vaibhav Sooryavanshi Records (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Vaibhav Sooryavanshi Records: ఒకే ఇన్నింగ్స్‌తో 7 ప్రపంచ రికార్డులు.. వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఇదే..!

Vaibhav Sooryavanshi Records: ఒకే ఇన్నింగ్స్‌తో 7 ప్రపంచ రికార్డులు.. వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఇదే..!

2

రూ.15 లక్షల బీమా, 50 శాతం డీఏ బేసిక్ పేలో విలీనం.. 8వ వేతన సంఘం కీలక డిమాండ్స్ ఇవే..!

3

3 నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 1199 ప్లాన్‌తో రోజుకు 2.5GB డేటా, అమెజాన్ ప్రైమ్, 18+ OTT యాప్స్ ఉచితం!

4

Vaibhav Sooryavanshi: కోచ్ చెప్పిన ఆ ఒక్క మాటే.. పిచ్ చూసి ప్లాన్ మార్చిన వైభవ్.. డబుల్ సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే..!

5

Karnataka: కర్ణాటకలో షాకింగ్.. రన్నింగ్ బస్సు నుంచి రోడ్డుపై జారీ పడ్డ మహిళ.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vaibhav Sooryavanshi Top Records: భారత క్రికెట్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తాజాగా ప్రపంచ క్రికెట్ రికార్డులను తిరగరాశాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోనుంది. కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేసిన వైభవ్.. ఒకే ఇన్నింగ్స్‌తో ఏడు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ఈ ఘనతలు సాధించడం విశేషం.

దోహాలో జరిగిన ఈ మ్యాచ్‌లో 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఎ ఊహించని విధంగా లక్ష్యం వైపు దూసుకెళ్లింది. వైభవ్ మొదటి ఓవర్‌ నుంచే బాదుడు మొదలుపెట్టేశాడు. కేవలం 16 బంతుల్లో అర్ధ శతకం.. 28 బంతుల్లో సెంచరీ.. 40 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. ఆ తరువాత 52వ బంతికి డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా 204 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 28 సిక్సర్లు బాదాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 384.91గా నమోదైంది.

వైభవ్ సృష్టించిన 7 రికార్డులు ఇవే..

1.లిస్ట్-ఏలో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

యూఏఈతో మ్యాచ్‌లో వైభవ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో వైభవ్‌కు ఇది రెండో వేగవంతమైన అర్ధశతకం. అంతకుముందు 2026 జూన్ 21న శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

2.లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ

కేవలం 28 బంతుల్లోనే శతకం సాధించి లిస్ట్-ఏ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ పేరిట ఉండేది. 2023లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున టాస్మానియాపై అతడు 29 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును అధిగమించాడు.

3.40 బంతుల్లోనే 150 పరుగులు

శతకం తరువాత వైభవ్ మరింత రెచ్చిపోయాడు. 150 పరుగుల మార్కును కూడా మెరుపు వేగంతో అందుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే ఈ ఘనత సాధించి లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

4.52 బంతుల్లో డబుల్ సెంచరీ

సుడిగాలి ఇన్నింగ్స్‌తో కేవలం 52 బంతుల్లోనే ద్విశతకం పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బౌస్ పేరిట ఈ రికార్డు ఉండేది. 2024లో ఫోర్డ్ ట్రోఫీలో కాంటర్‌బరీ తరఫున ఆడుతూ ఒటాగోపై 103 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును ఏకంగా 51 బంతులు ముందుగానే అధిగమించాడు.

5.ఒక లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు

వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 28 సిక్సర్లు బాదాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా ఆటగాడు డార్సీ షార్ట్ 2018లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్‌లాండ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో 23 సిక్సర్లు బాదాడు.

6.ప్రొఫెషనల్ క్రికెట్‌లోనూ సిక్సర్ల రికార్డు

కేవలం లిస్ట్-ఏ క్రికెట్‌లోనే కాకుండా పురుషుల ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ వైభవ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ ఘనత భారత ఆటగాడు తన్మయ్ అగర్వాల్ పేరిట ఉండేది. 2023-24 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున అరుణాచల్ ప్రదేశ్‌పై అతడు ఒక ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లో 26 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు వైభవ్ 28 సిక్సర్లతో ఆ రికార్డును అధిగమించాడు.

7. అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ

ఈ ఏడు రికార్డుల్లో అత్యంత ప్రత్యేకమైనది ఇదే. కేవలం 15 ఏళ్ల 242 రోజుల వయసులోనే వైభవ్ డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో పురుషుల ప్రొఫెషనల్ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో ద్విశతకం సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇలా ఒకే ఇన్నింగ్స్‌తో ఏడు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket