• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Karthika Pournami: తెలంగాణ ఆలయాలకు కార్తీక పౌర్ణమి కాంతులు.. భక్తులతో కిటకిట

Karthika Pournami: తెలంగాణ ఆలయాలకు కార్తీక పౌర్ణమి కాంతులు.. భక్తులతో కిటకిట

Devotees Heavy Rush To Temple For Karthika Pournami: ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన కార్తీకమాసంలో వచ్చిన పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో పూజలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 24, 2026, 23:07 IST|Updated: Nov 24, 2026, 23:14 IST
joinshare
Karthika Pournami: తెలంగాణ ఆలయాలకు కార్తీక పౌర్ణమి కాంతులు.. భక్తులతో కిటకిట
Image Credit: Governor At Karmanghat Temple

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Temple Rush: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలకు కార్తీక పౌర్ణమి శోభ.. భక్తులతో కిటకిట

Temple Rush: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలకు కార్తీక పౌర్ణమి శోభ.. భక్తులతో కిటకిట

2

Kondagattu Temple: కార్తీక పౌర్ణమి వెలుగుల్లో కొండగట్టు అంజన్న ఆలయం

3

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం

4

Karthika Pournami: తెలంగాణ ఆలయాలకు కార్తీక పౌర్ణమి కాంతులు.. భక్తులతో కిటకిట

5

Car Price Hike: కార్ల ప్రియులకు భారీ షాక్‌.. ధరలు పెంచిన మూడు దిగ్గజ కంపెనీలు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Karthika Pournami 2026: కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ, వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక మంగళవారం కార్తీక పౌర్ణమి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేసిన భక్తులు ఉపవాస దీక్ష స్వీకరించారు. అనంతరం సాయంత్రం పూట ఆలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. మరికొందరు తులసీ మాతకు పూజించారు.

కీసరగుట్టకు కార్తీక శోభ
హైదరాబాద్‌ శివారులోని కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. కీసరగుట్ట భవానీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కీసర శివనామస్మరణతో మార్మోగింది.

కర్మన్‌ఘాట్‌ ఆలయంలో గవర్నర్‌ దంపతులు
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా దంపతులు కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణి జానకి శుక్లాతో కలిసి హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అంతకుము ఆలయానికి చేరుకున్న గవర్నర్‌ దంపతులకు దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్‌ దంపతులు స్వామివారిని దర్శించుకుని, పరమశివుడు, శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ టీటీడీ ఆలయం, చిలుకూరు బాలాజీ ఆలయం తదితర శైవాలయాలు భక్తులతో నిండిపోయాయి. బోడుప్పల్‌లోని ఎన్‌ఐఎన్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర శివాంజనేయ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది . కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీకదీపం వెలిగిస్తూ భక్తులు శివకేశవులను ఆరాధించారు. తమకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక ముడుపు కట్టి పదకొండు ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని పలువురు భక్తులు చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Telugu News
Telangana News
Hyderabad