SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: హైదరాబాద్‌ను బాంబులతో పేల్చేస్తాం.. పోలీసులకు లష్కరే తొయిబా పేరుతో బెదిరింపు మెయిల్స్ .!.

Bomb threat mail to Hyderabad: కాచిగూడలోని హోటల్ టూరిస్టు ప్లాజా, రైల్వే స్టేషన్ తో పాటు పలు ప్రాంతాల్ని బాంబులతో పేలుస్తామని పోలీసులకు మెయిల్ వచ్చింది. లష్కరే తొయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అందులో ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Written By Inamdar Paresh
Published: Nov 22, 2026, 18:51 IST | Updated: Nov 22, 2026, 19:09 IST
Image Credit: Hyderabadcrime(file)
Join

Bomb threatening mail to hyderabad police: హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల బాంబులు పేలుతాయంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. లష్కరే తోయిబా పేరుతో మెయిల్ రావడంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా 26/11 ఉగ్రదాడి తరహాలో పేలుళ్లు ఉంటాయని అందులో రాసుకొచ్చారు. కాచీగూడలోని హోటల్ టూరిస్టు ప్లాజా , రైల్వే స్టేషన్ తో పాటు పలు ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు.

జమ్ముకశ్మీర్ లష్కరే తొయిబా టాప్ కమాండార్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్  భట్ హత్యకు ప్రతీకరంగా దాడులు చేస్తామని ఆ మెయిల్ లో ఉంది. దీంతో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులను అలర్ట్ చేశారు. 

 మరోవైపు సిటి వ్యాప్తంగా రైల్వేస్టేషన్ లు, బస్టాండ్ లు, హోటళ్లు, ప్రార్థన మందిరాల వద్ద పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక నిఘా పెంచారు. అన్ని భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అధికారుల్ని ఆదేశించారు. దీంతో నగరం వ్యాప్తంగా ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES