SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kavitha: ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ.. తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కవిత

Kavitha First Election Fight In Khairatabad By Poll: సొంత పార్టీ పెట్టి గుర్తింపు కోసం తహతహలాడుతున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 27, 2026, 10:12 AM IST | Updated: Sep 27, 2026, 10:22 AM IST
Image Credit: Kavitha Twitter
Join

Khairatabad By Poll: తెలంగాణ రక్షణ సేన పార్టీ అగ్నిపరీక్షకు సిద్దమైందా..! ఖైరతాబాద్ ఉప ఎన్నిక‌లో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కల్వకుంట్ల కవిత రెడీ అయ్యారా..! ఇప్పుడు రక్షణ సేన ఎంట్రీతో.. ఖైరతాబాద్ లెక్కలు మారుతున్నాయా? కవిత పార్టీ అభ్యర్ధి రంగంలోకి దిగితే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకుకు చీలిక ఖాయమనే చర్చ జరుగుతోందా? ఇంతకీ కవిత ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారు అనేది ఈ స్టోరీలో చూసేద్దాం!

తెలంగాణ రక్షణ సేన పార్టీ తొలి పరీక్షకు సిద్దమవుతోంది. త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు వేటు వేయడంతో బైపోల్ ఖాయమైంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఈ ఎన్నికలో గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపవచ్చని లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ బైపోల్‌ సిద్దమయ్యారని అంటున్నారు. ఇక్కడ సత్తా చాటితే భవిష్యత్తులో గట్టి ప్రభావం చూపవచ్చనే ఆలోచనలో కవిత ఉన్నారని తెలుస్తోంది. అయితే పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనేదానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని కవిత చెప్పుకొచ్చారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పోటీపై కవిత క్లారిటీ ఇచ్చారు. త్వరలో జరిగే బైపోల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధిని ఎన్నికల బరిలో నిలపనున్నట్టు ప్రకటించారు. అయితే అభ్యర్ధిగా ఎవరు ఉంటారనేది చెప్పనప్పటికీ.. తమ పార్టీ నుంచి పోటీలో ఉంటారని అయితే ప్రకటించారు. అంతేకాకుండా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అనుమతించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. లేదంటే రాజ్యాంగం, చట్టం అవసరం లేదని మనమే చెప్పినట్లు అవుతుందన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందా అనే అనుమానం వస్తోందన్నారు. అయితే కొత్త పార్టీ ప్రకటించాక.. తొలిసారి ఎన్నికలు జరుగుతుండటంతో.. ఉప ఎన్నికను కవిత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో ప్రధాన కేంద్రంగా ఉన్న ఖైరతాబాద బస్తీ ఓటర్లు, నిరుద్యోగ యువత, ఉద్యమ నేతలను ఏకం చేసేలా ప్రచార కార్యచరణను కవిత సిద్దం చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. ప్రజా సమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేసే నేతనే ఎన్నికల కార్యక్షేత్రంలోకి దింపుతామనే సంకేతాలను కవిత పంపించారు.

కవిత ఎంట్రీతో టెన్షన్
ఖైరతాబాద్ రేసులోకి కవిత ఎంట్రీ.. కాంగ్రెస్- బీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పెడుతోంది. బైపోల్ కేవలం కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్యే ఉంటుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. బీజేపీకి కూడా ఖైరతాబాద్‌లో మంచి పట్టుంది. గత 2014 ఎన్నికల్లో ఇక్కడినుంచి బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. దాంతో ఈసారి టికెట్ ఆయనకే అన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి, ఇంద్రసేనా రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అటు బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ పోటీలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సాయికిరణ్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ఓకే చెప్పారని ప్రచారం సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీలో ఉంటారా.. లేక.. ఇంకా ఎవరినైనా అభ్యర్ధిగా ప్రకటిస్తారా అనేదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన కూడా ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించడంతో.. ఎన్నికలపై తప్పక ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం తెలంగాణ రక్షణ సేన ఎంట్రీతో ఖైరతాబాద్ లెక్కలు మారడం పక్కా అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత తప్పక దెబ్బతీస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే కవిత నివాసం ఉంది. ఆమెకు నియోజకవర్గంలో అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో కవిత  ప్రభావం ఎన్నికలపై తప్పక ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే బలమైన అభ్యర్ధిని రంగంలోకి దింపితే మాత్రం.. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరోవైపు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో.. ఉప ఎన్నికను కవిత కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఎలాగైనా ఖైరతాబాద్‌లో సత్తా చాటితే.. వచ్చే ఎన్నికలకు క్యాడర్ ను మరింత బూస్టింగ్ ఇస్తామనే ధీమాలో కవిత ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఖైరతాబాద్ బైపోల్‌ ఓడితే.. కవిత ఇమేజ్ మరింత డ్యామేజ్ కావడం ఖాయమనే చర్చ సైతం జరుగుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES