SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ktr: కాంగ్రెస్ పార్టీ, బీజేపీ దొందు దొందే.. అమిత్ షా, సీఎం రేవంత్ టార్గెట్ గా కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

ktr fires on cm Revanth reddy: అమిత్ షా వచ్చి చేతులు ఊపుకుంటూ ఒక కిలోమీటర్ నడిచి వెళ్లిపోయారు తప్ప తెలంగాణకు ఆయన ఏమి ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా సీఎం రేవంత్ పై పదునైన విమర్శలు గుప్పించారు.

Written By Inamdar Paresh
Published: Nov 04, 2026, 01:49 PM IST | Updated: Nov 04, 2026, 02:00 PM IST
Image Credit: ktr fires on cm revanth reddy
Join

Ktr fires on cm revanth reddy govt and central bjp: తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రావడంతో బీజేపీలో కొత్త జోష్ కన్పిస్తుంది.  అమిత్ షా తన పర్యటలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వెంటిలెటర్ మీద ఉందన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇండియా కూటమితో కలిసి సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలకు దిగారు.  ఈ క్రమంలో కేంద్రం బీజేపీపై మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు. అదే విధంగా తెలంగాణ పర్యటనకు అమిత్ షా వచ్చినప్పుడు ఆయన పాదాలకు బీజేపీ తెలంగాణ చీఫ్ చింతల రామచందర్ రావు కాళ్లు మొక్కారు. దీనిపై కేటీఆర్ మండిపడ్డారు.


పదవి కోసం కాళ్లు మొక్కేంతగా దిగజారాలా?.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కన్నా అమిత్ షా ఆరేళ్లు చిన్నోడని.. నీకన్నా ఆరేళ్లు చిన్నోడైన అమిత్ షా కాళ్లు మొక్కాల్సిన అవసరమేంటి రామచందర్?.. అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసలు అమిత్ షా కాళ్లు మొక్కేంతగా ఆయన నీకు లేదా తెలంగాణకు ఏమిచ్చాడు?.. ఇదేనా తెలంగాణ రేషం.. అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, జాతీయ ప్రాజెక్ట్, దవాఖానా, విశ్వవిద్యాలయం, కాలేజీ.. ఇవేమీ ఇవ్వకుండానే అమిత్ షా  వెళ్లిపోయాడంటూ సెటైర్లు వేశారు.

ఏమైనా ఉంటే తెలంగాణ నుంచి తీసుకుపోవడమే తప్పి.. రాష్ట్రానికి నాలుగు పైసలు కూడా ఇవ్వలేదన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి తన పదవి కోసం EMI కట్టడం తప్ప.. అక్కడి నుంచి తెచ్చేది ఏమీ లేదని కేటీఆర్ పంచ్ లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ హీనంగా తయారయ్యారని విమర్శించారు. అమిత్ షా నడుస్తుంటే.. బౌన్సర్‌లాగా బండి సంజయ్ అందరికన్నా ముందు పరిగెత్తి, అందరినీ నూకుతుండని..

నువ్వొక కేంద్రమంత్రివి.. ఆ పదవికి అయినా ఇజ్జత్ ఇవ్వు.. అంటూ కేటీఆర్ పంచ్ లు వేశారు. ఇక ఢిల్లీలో ప్రియాంకా గాంధీ సెక్యూరిటీ అయితే.. రేవంత్ రెడ్డిని పక్కకు నూకి పారేస్తుండని.. ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు మనోళ్లంటే ఇంతే విలువ ఉందని విమర్శించారు. అయినా సిగ్గు లేకుండా మనోళ్లు వాళ్ల చుట్టే గిరాగిరా అని తిరుగుతున్నారంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ఏడాదిలోపు కేసీఆర్ మళ్లీ తిరిగి రాబోతున్నారని, రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకులకు పారిశ్రామిక వేత్తలు ఆశపడితే.. HILT పేరిట జరుగుతున్న స్కామ్‌లో మీరు భాగస్వాములు అయితే.. అనుభవించేది మీరేనంటూ వార్నింగ్ ఇచ్చారు.  ప్రజల ఆశీర్వాదంతో మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది.. అప్పుడు ఈ భూ దందాలకు చెక్ పెడతామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.

 సీఎం రేవంత్ కు  భూములు అమ్మడం.. లేదా కేసీఆర్‌ను తిట్టడం తప్ప ఏమి రాదన్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్‌లో మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిని కబ్జా చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం దానిపై గట్టిగా పోరాడిందన్నారు. అడవులు నరికే వీరప్పన్‌ను అటవీ శాఖ మంత్రి చేస్తే ఎలా ఉంటుందో.. భూములు అమ్ముకునే రేవంత్ రెడ్డి అనే బ్రోకర్‌ని ముఖ్యమంత్రి చేస్తే  తెలంగాణ పరిస్థితి అలా అయ్యిందని కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES