Big twist in jagtial boy adoption case: జగిత్యాలలో ఇటీవల మూడేళ్ల బాలుడి దత్తత వివాదం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా జంబిగద్దెకు చెందిన సరిత, శ్రీనివాస్ గౌడ్ దంపతులు. అయితే వీరికి సంతానం లేదు. దీంతో వీరిద్దరు మూడేళ్లే క్రితం కోరుట్లకు చెందిన ఒక కుటుంబం నుంచి బాలుడ్ని దత్తత తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి బాలుడ్ని కంటికి రెప్పలా కాపాటుకుంటున్నారు. అతడే తమ ప్రపంచంలా బతుకుతున్నారు. ఇంతలో వీరి కుటుంబంలో ప్రాపర్టి విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కొంత మంది చైల్డ్ వెల్ ఫెర్ కేంద్రంకు ఫిర్యాదు చేశారు. దత్తన చట్టప్రకారం జరగలేదని చెప్పారు. దీంతో చైల్డ్ వెల్ ఫెర్ అధికారులు రంగంలోకి బాలుడ్ని సెప్టెంబర్ 16న తీసుకుని శిశు సంక్షేమ కేంద్రంకు అప్పగించారు. అప్పటి నుంచి బాలుడు శిశు సంక్షేమ కేంద్రంలోనే ఉన్నాడు.
అయితే ఆ బాలుడి కోసం తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టు వరకు వెళ్లారు. తమకు తమ పిల్లాల్ని అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసం అక్టోబర్ 16వరకు బాలుడ్ని మరల తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్ని సైతం శిశు సంక్షేమ కేంద్రం అధికారులు పాటించకుండా కాలాయాపాన చేశారు. ఇటీవల బాలుడ్ని తల్లిదండ్రులు చూసేందుకు వచ్చినప్పుడు అమ్మా.. నేను ఉండను.. తీసుకెళ్లండి అని ఏడ్చిన వీడియో వైరల్ కావడంతో అది కాస్త అధికారుల వరకు వెళ్లి వెంటనే కోర్టు ఆదేశాల ప్రకారం మూడేళ్ల బాలుడ్ని మరల తల్లిదండ్రులకు అప్పగించారు.
మరల తమ పిల్లాడు తమ వద్దకు రావడంతో ఆ పిల్లాడితో పాటు, తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ ఇంతలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం అందర్ని కలిసి వేసేదిగా మారింది. బాలుడి దత్తత తీసుకొనే ప్రక్రియ చట్ట ప్రకారం జరగలేదని, అదే విధంగా సీడబ్ల్యూసీ నిబంధనలు, అధికారుల ఆధారాల్ని పరిశీలించకుండానే తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చిందని దీనిపై స్టే విధించాలని మరల బాలుడ్ని శిశు సంక్షేమ కేంద్రంకు అప్పగించాలని రిట్ దాఖలు చేశాడు.
బాలుడు తల్లిదండ్రులు వద్ద ఉంటే విచారణకు ఆటంకం ఏర్పడుతుందని గత ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ రిట్ వేయడం బిగ్ ట్విస్ట్ మారింది. దీనిపై మూడేళ్ల బాలుడి తల్లిదండ్రులతో పాటు, స్థానికులు సైతం మండిపడుతున్నారు. బాలుడు తల్లిదండ్రుల కోసం గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో ఈ విధంగా రిట్ వేయడం ఏంటని తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు.