• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /KTR Tweet: ఇటీవల నేను విన్న అతి పెద్ద జోక్ ఇదే.. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు కేటీఆర్ ఖతర్నాక్ పంచ్‌లు.. మ్యాటర్ ఏమిటంటే..?..

KTR Tweet: ఇటీవల నేను విన్న అతి పెద్ద జోక్ ఇదే.. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు కేటీఆర్ ఖతర్నాక్ పంచ్‌లు.. మ్యాటర్ ఏమిటంటే..?..

Ktr on uttam kumar reddy comments: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సమ్మర్ లో నీళ్ల సమస్యలు లేకుండా రిజర్వాయర్ లో నీళ్లను నిల్వచేశామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేటీఆర్ తన దైన శైలీలో కౌంటర్ లు వేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 16, 2026, 13:26 IST|Updated: Nov 16, 2026, 13:40 IST
joinshare
KTR Tweet: ఇటీవల నేను విన్న అతి పెద్ద జోక్ ఇదే..  మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు కేటీఆర్ ఖతర్నాక్ పంచ్‌లు.. మ్యాటర్ ఏమిటంటే..?..
Image Credit: ktr(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ktr satirical tweet on minister uttam kumar reddy: తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. పల్లె, పట్నం అని తేడా లేకుండా ప్రజలు నీళ్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో నీళ్ల కొరతతో హస్టళ్లలో నీళ్లు లేక వాటర్ ట్యాంక్ లను తెప్పించుకుంటున్నారు. అపార్ట్ మెంట్ లలో సైతం నీళ్లను పొదుపుగా వాడుకొవాలని సూచిస్తున్నారు. మరోవైపు నీళ్ల కొరతతో వాటర్ ట్యాంకర్ లకు ఫుల్ గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎల్ నినో ప్రభావంను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చారు. రైతన్నలు ఆరుతడి పంటల్ని వేయాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. తెలంగాణలో తాగు నీటి సమస్య లేదని, రాబోయే సమ్మర్ కోసం రిజర్వాయర్ లో నీళ్లను నిల్వచేశామంటూ వ్యాఖ్యలు చేశారు.  

మేడి గడ్డ బ్యారెజీ బీఆర్ఎస్ హయాంలో కుంగిపోయిందన్నారు. రూ.38,500 కోట్లతో అంచనాతో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు 30 శాతం పూర్తయిందన్నారు. రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత  కేవలం కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించాలని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందీళ్లలో తీవ్రలోపాలున్నాయని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు చెప్పారన్నారు.

దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్ లో పంచ్ లు వేశారు. కేటీఆర్ ఎక్స్ వేదికగా  కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇటీవల ఎల్ నినోపై, తాగునీటి కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఖతర్నాక్ సెటైర్లు వేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాగు నీటి సమస్య లేదని, రాబోయే సమ్మర్  వరకు కావాల్సినన్ని నీళ్లను రిజర్వాయర్ లు నిల్వచేశామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. 

తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసిన తాగు నీటి ట్యాంకర్ లు, నీటి సమస్యలతో హస్టళ్లకు సెలవులు కూడా ప్రకటించడం కన్పించడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల తాను విన్న అతి పెద్ద జోక్ ఇదేనని, కాంగ్రెస్ జోకర్లను ఎన్నుకుంటూ.. ఇలాంటి సర్కస్ లు చూడాల్సిందే నంటూ సెటైర్లు వేశారు.  ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్  కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
KTR
Revanth Reddy
Telangana News
Telugu News