Telangana: తెలంగాణలో ఘోరం.. కాలేజీ యువతికి లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.
Lecturer molested college girl in sangareddy: సంగారెడ్డిలో ఉన్న పటేల్ గూడ ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ కాలేజీ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. రోజు తనతో చాటింగ్ చేయాలని ఇంగ్లీష్ లెక్చరర్ రవి యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా కాలేజీకి వచ్చి లెక్చరర్ కు తగిన బుద్ది చెప్పారు.
Lecturer molested Ellenki polytechnic college girl: సమాజంలో ఇటీవల మహిళల భద్రత పెనుసవాల్ గా మారింది. ప్రతి చోట మహిళలు, అమ్మాయిలు తరచుగా వేధింపులకు గురౌతున్నారు. పవిత్రమైన స్కూళ్లలో, కాలేజీల్లో కూడా వేధింపుల పర్వం కొనసాగడం ఇటీవల అందర్ని ఆందోళనలకు గురిచేస్తుంది. ఈ క్రమంలో కొంత మంది పవిత్రమైన టీచర్, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నీచపు పనులకు పాల్పడుతున్నారు. స్కూళ్లలో తోటి మహిళ సిబ్బంది, విద్యార్థినుల్ని లైంగికంగా వేధిస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలోని ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో ఒక లెక్చరర్ నిర్వాహకం అందర్ని షాక్ కు గురిచేసింది.
సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలోని ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్ లెక్చరర్ రవి.. డిప్లొమా ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తనతో రోజు చాటింగ్ చేయాలని,క్లోజ్ గా ఉండాలని సదరు లెక్చరర్ ఆమెను తరచుగా వాట్సాప్ చేసేవాడు. దీంతో ఈ వేధింపులకు తాళలేక ఆమె తన తోటి స్నేహితులకు, ఇంట్లో వారికి చెప్పుకుంది.
దీంతో వారు కాలేజీకి వచ్చి లెక్చరర్ రవిని నిలదీశారు. ఆతర్వాత గొడవ జరిగి, విద్యార్థులు, యువతి కుటుంబ సభ్యులు లెక్చరర్ రవిపై దాడి చేశారు. ఆతర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని రవిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర వివాదంగా మారింది.