SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మాదాపూర్ తమ్మిడికుంట చెరువుకు పునర్వైభవం.. నేడు ప్రారంభం..

Thammidikunta Lake restoration: హైదరాబాద్ మహా నగరంలో హైడ్రా చేపడుతున్న ఆపరేషన్‌లో భాగంగా కబ్జాకు గురువుతున్న చెరువుల చెర విడిపిస్తోంది. తాజాగా మాదాపూర్‌లో కీలకమైన తమ్మడిహట్ట చెరువును సుందరీకరణ పూర్తైంది. హైడ్రా అభివృద్ధి చేసిన మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 11, 2026, 08:22 AM IST | Updated: Nov 11, 2026, 10:24 AM IST
Image Credit: Thammidi kunta Cheruvu (Source/ZEE Telugu News)
Join

Thammidikunta Lake Opening:  చెరువు అభివృద్ధిలో భాగంగా FTL పరిధిలోని గుడిసెలను కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పత్రాలను కూడా సీఎం రేవంత్  అందజేయనున్నారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సహకరించిన సినీ నటుడు అక్కినేని నాగార్జున గౌరవ అతిథిగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి  హాజరవుతున్నారు. అక్కడి ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఎమ్మెల్యే గాంధీ, సీనియర్ పోలీస్ అధికారులు , హైడ్రా ప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా సభా ప్రాంగణం, చెరువు చుట్టూ చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు. చెరువులోకి శుద్ధి చేసిన నీటిని మాత్రమే తరలించేలా ఏర్పాటు చేసిన ఎస్టీపీ వ్యవస్థల తీరును కమిషనర్ సమీక్షించారు. ఇన్ లెట్లను సక్రమంగా అభివృద్ధి చేయడం వల్ల శిల్పారామం పరిసర ప్రాంతాలకు వరద ముప్పు పూర్తిగా తప్పిపోతుందని అంచనా వేశారు.  కొండాపూర్ పోలీస్ బెటాలియన్ వైపు నుంచి వచ్చే భారీ వరద నీరు కూడా నేరుగా చెరువులోకి చేరేలా పక్కా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

హైడ్రా పునరుద్ధరణ పనులు..

ఒకప్పుడు వర్షం వస్తే చాలు.. ఆ చుట్టుపక్కల దారులన్నీ జలమయమైపోయేవి. ముఖ్యంగా శిల్పారామం పరిసరాల్లో నడుంలోతు నీళ్లు చేరి, వాహనదారులు, స్థానికులు తీవ్ర అవస్థలు పడేవారు. కానీ, ఇప్పుడు ఆ దృశ్యాలన్నీ గతం కాబోతున్నాయి.  హైడ్రా చేపట్టిన పునరుద్ధరణ చర్యలతో మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంది. పర్యాటకులను, స్థానికులను ఆకట్టుకునేలా సుందరీకరించిన ఈ చెరువు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ఆహ్లాదకరంగా తమ్మడికుంట చెరువు..

హైడ్రా అభివృద్ధి చేయక ముందు తర్వాతలా తమ్మిడికుంట పరిసరాలు మారాయి.  మురుగు నీటితో దుర్గంధ భరిత వాతావరణంలో ఉన్న పరిసరాలు ఇప్పుడు ఆహ్లాదంగా మారాయి. నిర్మాణ వ్యర్థాలు, చెత్త, బయోమెడికల్ వేస్ట్ డంపింగ్ యార్డుగా ఉన్న తమ్మిడికుంట యిప్పుడు ఆ వ్యర్థాలను వదిలించుకొని పర్యావరణ హితంగా, ఆరోగ్యకరంగా మారింది. 30 వేల ట్రక్కులకు పైగా పూడిక తొలగడంతో దుర్గంధభరిత వాతావరణం పోయింది. చెరువు చుట్ట 1.6 కిలోమీటర్ల పాత్ వే, అత్యాధునిక ఓపెన్ జిమ్, పిల్లల క్రీడా స్థలం అన్ని వయసుల వారికి ఆరోగ్య ప్రదాయినిలుగా మారాయి.

భూగర్భ జలాలు రీ ఛార్జ్..

తమ్మిడికుంట చెంత పరచుకున్న పచ్చదనం ఇప్పుడు ఆహ్లాదంగా మారింది. చెరువు సందర్శనకు వచ్చేవారు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన వేదిక మధ్యలో 60 ఏళ్ల బోన్సాయ్ మొక్క ఆకర్షణగా నిలిచింది.  వర్షాకాలం వరద కట్టడి, భూగర్భ జలాల వృద్ధి యిలా చెరువుకు ఉండే సహజ లక్షణాలు అన్ని సమకూరడంతో పర్యావరణహితంగా మారింది. ఈ చెరువు పునరుద్దరణతో అక్కడి భూగర్భ జలాల పెరగనున్నాయి. అంతేకాదు అక్కడ  వేలాది మొక్కలు చెరువు చుట్టూ నాటి పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చారు. చెరువు పరిసరాల్లో ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు, ఓపెన్ జిమ్ వసతులను అధికారులు పరిశీలించారు. చెరువు చుట్టూ నూతనంగా నిర్మించిన బండ్, వాకింగ్ పాత్ వేపై అధికారులతో కలిసి నడిచిన కమిషనర్ రంగనాథ్, అక్కడ నెలకొన్న ఆహ్లాదకర వాతావరణంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES