• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /జాతీయ విద్యా దినోత్సవం.. IIT, UGCల వ్యవస్థాపకుడు ఆజాద్ ఆశయాలు నెరవేరుతున్నాయా?.. నేటి విద్యా వ్యవస్థ సవాళ్లు ఇవే..!!

జాతీయ విద్యా దినోత్సవం.. IIT, UGCల వ్యవస్థాపకుడు ఆజాద్ ఆశయాలు నెరవేరుతున్నాయా?.. నేటి విద్యా వ్యవస్థ సవాళ్లు ఇవే..!!

National Education Day 2026: భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవం (రాష్ట్రీయ శిక్షా దివస్)గా అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు.

Written ByBhoomi
Published: Nov 11, 2026, 10:11 AM IST|Updated: Nov 11, 2026, 10:13 AM IST
joinshare
జాతీయ విద్యా దినోత్సవం.. IIT, UGCల వ్యవస్థాపకుడు ఆజాద్ ఆశయాలు నెరవేరుతున్నాయా?.. నేటి విద్యా వ్యవస్థ సవాళ్లు ఇవే..!!
Image Credit: National Education Day 2026:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
నవంబర్ 16న రాష్ట్రంలో సెలవు.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్..!!

నవంబర్ 16న రాష్ట్రంలో సెలవు.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్..!!

2

సినిమాల్లో చూసే మరుగుజ్జుల గ్రామం నిజంగానే ఉంది.. ఎక్కడో తెలుసా?

3

అవాక్కయ్యే ఆఫర్ ఇచ్చిన ఎయిర్‌టెల్.. రూ. 349 ప్లాన్‌పై 1+1 ఉచిత ఆఫర్.. రోజూ 2GB డేటా, అపరిమిత 5G!

4

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. సిల్వర్ కిలోకు రూ.5 వేల మేర కిందకు..!!

5

భాయ్ దూజ్ రోజున చిత్రగుప్తుడినే ఎందుకు పూజిస్తారు? పూర్తి వివరాలు ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

National Education Day 2026: భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీని  జాతీయ విద్యా దినోత్సవం (రాష్ట్రీయ శిక్షా దివస్)గా అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలకు గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. దేశంలో విద్యా రంగానికి బలమైన పునాదులు వేసిన ఆయన సేవలను స్మరించుకోవడంతో పాటు విద్య ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.

జననం, బిరుదులు,  బహుభాషా ప్రావీణ్యం:

*మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబరు 11న మక్కాలో ఖైరుద్దీన్ అహమ్మద్, ఆలియా బేగమ్ దంపతులకు జన్మించారు.

*ఆయన అసలు పేరు 'మొహియుద్దీన్ అహ్మద్'.

*'అబుల్ కలాం' అనేది ఆయనకు లభించిన బిరుదు కాగా, 'ఆజాద్' అనేది ఆయన కలం పేరు.

*ఆజాద్ అపారమైన మేధస్సు కలిగిన బహుభాషా కోవిదుడు. ఆయన అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్,  బెంగాలీ వంటి అనేక భాషలలో అసాధారణ ప్రావీణ్యాన్ని సంపాదించారు.

స్వాతంత్ర్య సంగ్రామంలో క్రియాశీల పాత్ర:

*భారత స్వాతంత్ర్య పోరాటంలో మౌలానా ఆజాద్ అత్యంత కీలక పాత్ర పోషించారు.

*1920లో మహాత్మా గాంధీ ప్రారంభించిన 'సహాయ నిరాకరణ ఉద్యమం' ద్వారా ప్రేరణ పొంది భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు.

*1923లో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికై, అతి పిన్న వయస్సులో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాయకుడిగా నిలిచారు.

*ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొని సుమారు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు.

*సాహితీవేత్త అయిన ఆయన భారత స్వాతంత్ర్య పోరాట అనుభవాలతో 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు.

తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థ నిర్మాణం:
స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ఏర్పడిన మొదటి భారత ప్రభుత్వంలో మౌలానా ఆజాద్ 1947 నుండి 1958 వరకు సుదీర్ఘంగా 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు.

విద్యా సంస్కరణలు: 
బ్రిటిష్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి, కళలు, సాహిత్యం, విద్యా రంగాలను ప్రక్షాళన చేశారు. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేశారు.

ఉన్నత విద్యా సంస్థల స్థాపన: 
ఆయన హయాంలోనే దేశంలో విద్యాభివృద్ధికి మూలస్తంభాలైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటయ్యాయి.

సాంకేతిక , సాంస్కృతిక రంగాలు: 
భారతదేశంలో మొదటి ఐఐటీ అయిన 'ఐఐటీ ఖరగ్‌పూర్' స్థాపనలో ఆయన పాత్ర మరవలేనిది. అలాగే సంగీత, సాహిత్య, లలిత కళల వికాసానికి స్వయం ప్రతిపత్తి కలిగిన సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీలను నెలకొల్పారు.

జాతీయ విద్యా దినోత్సవం, భారతరత్న పురస్కారం:
భారత విద్యా రంగానికి, జాతీయాభివృద్ధికి ఆజాద్ చేసిన నిరుపమాన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1992లో ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న'ను ప్రధానం చేసింది. ఆయన జన్మదినమైన నవంబరు 11ను "జాతీయ విద్యా దినోత్సవం"గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2008లో నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, పిల్లలందరికీ ఉచిత,  నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. 1958 ఫిబ్రవరి 22న కన్నుమూసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.

కేవలం నవంబర్ 11న ఉత్సవాలు, వేడుకలు నిర్వహించడానికే పరిమితం కాకుండా, కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకువస్తూ, ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని,  ప్రతీ పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించి జాతీయ విద్యా విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేయాలి.ప్రభుత్వాలు పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి.. అర్హులైన ఉపాధ్యాయులను నియమించినప్పుడే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు, ఈ జాతీయ విద్యా దినోత్సవానికి నిజమైన సార్థకత చేకూరుతుంది.

Also Read: 

 

 

 

 

 

ఎన్విడియా CEOకు బిగ్ షాక్.. ఒక్కరోజే రూ.17 లక్షల కోట్లు  ఆవిరి..!!

 

 

 

తెలంగాణాలో వారానికి 5 రోజుల పనిదినాలపై సర్కార్ ఆరా..?

 

 

 

 

 

 

ఉద్యోగులకు సుప్రీం బిగ్ షాక్.. ఆ ఒక్క తప్పు చేస్తే ఇక నేరుగా సస్పెన్షనే..!!

 

 

 

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష..!!

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News