• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి.. రాష్ట్ర బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు

తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి.. రాష్ట్ర బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు

Uttam Kumar Reddy: తుమ్మిడిహెట్టిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అవగాహనలేని రీ–ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం గుండెకాయను కూల్చేశారని.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సాగునీటి రంగం భ్రష్టుపట్టిందన్నారు. రూ.38 వేల కోట్ల ప్రణాళికను లక్ష కోట్లకు మించిన అప్పుల భారంగా మార్చారని ఫైర్ అయ్యారు.

Written ByAshok Krindinti
Published: Sep 18, 2026, 07:12 PM IST|Updated: Sep 18, 2026, 07:14 PM IST
joinshare
తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి.. రాష్ట్ర బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు
Image Credit: Uttam Kumar Reddy (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Uttam Kumar Reddy: ఉత్తర తెలంగాణ రైతాంగ భవిష్యత్తుతో ముడిపడిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకునేలా రాష్ట్ర బీజేపీ నాయకులు ఒత్తిడి తేవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్రతో అవసరమైన అంతర్రాష్ట్ర అంగీకారం సాధించే బాధ్యతను కేంద్రం స్వీకరించేలా తెలంగాణ బీజేపీ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించాలని సూచించారు. రాష్ట్రంలో విమర్శలు చేయడానికే పరిమితం కాకుండా, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ఢిల్లీని ఒప్పించడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఎల్‌ నినో ప్రభావం, రాష్ట్రంలో సాగునీటి పరిస్థితులపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వరకు, శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ వరకు, పాలమూరు–రంగారెడ్డి నుంచి రాజీవ్‌ భీమా, జవహర్‌ నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ వరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి పథకాల స్థితిగతులను సభ ముందుంచారు మంత్రి ఉత్తమ్. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన తప్పిదాలను ప్రస్తావించిన సమయంలో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తెలంగాణ రైతుల ఆశలకు ఆధారంగా నిలవాల్సిన నీటిపారుదల రంగాన్ని అప్పులు, అసంపూర్తి పనులు, సాంకేతిక వైఫల్యాల ఊబిలోకి నెట్టారని విమర్శించారు.
తుమ్మిడిహెట్టి కేంద్రంగా రూపొందించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని వదిలిపెట్టడం దేశ సాగునీటి చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదాల్లో ఒకటని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

అప్పటికే సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేపట్టిన పథకాన్ని సమగ్ర పరిశీలన లేకుండా పక్కనపెట్టి, ప్రాజెక్టు కేంద్రాన్ని మేడిగడ్డకు మార్చారని మంత్రి తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద అందుబాటులో ఉన్న ప్రాణహిత జలాలను గ్రావిటీ ఆధారంగా శ్రీపాద ఎల్లంపల్లికి తరలించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే, ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. సుమారు రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే అవకాశమున్న ప్రణాళికను అహంకారపూరితమైన రీ–ఇంజినీరింగ్‌తో లక్ష కోట్లకు మించిన ఆర్థిక భారంగా మార్చారని ఆరోపించారు. వ్యయాన్ని పెంచడం తప్ప ఆయకట్టుకు నమ్మకమైన నీరందించే వ్యవస్థను నిర్మించలేకపోయారని విమర్శించారు. భారీగా ప్రజాధనం వెచ్చించినప్పటికీ కాళేశ్వరం వ్యవస్థకు ఆరంభ ద్వారమైన మేడిగడ్డే కుంగిపోవడం గత పాలకుల అవగాహన లోపానికి, ప్రణాళికా వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.

“రాష్ట్ర ప్రజలను, మన పిల్లలను, రాబోయే తరాలను తాకట్టు పెట్టి 11 నుంచి 12 శాతం వడ్డీలకు అప్పులు తెచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం రుణాల చెల్లింపుల కోసమే మా ప్రభుత్వం ఏటా నీటిపారుదల బడ్జెట్‌ నుంచి రూ.15 వేల కోట్ల నుంచి రూ.16 వేల కోట్ల వరకు భరించాల్సి వస్తోంది. ఇంతటి ఆర్థిక భారాన్ని మోపిన తరువాత కూడా రైతుకు నమ్మకమైన నీటి భద్రతను ఇవ్వలేకపోయారు” అని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు.

వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం గుండెకాయ కళ్లముందే కుప్పకూలిపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన తరువాత కూడా గత పాలకులు తమ తప్పును అంగీకరించకుండా ప్రస్తుత ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం హాస్యాస్పదమన్నారు. డీపీఆర్‌లో పొందుపరిచిన సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ సమయంలో అనుసరించిన పునాది విధానం, నాణ్యత నియంత్రణ, నిర్వహణ నిర్ణయాలపై బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇది సాధారణ మరమ్మతుతో పరిష్కారమయ్యే లోపం కాదని, డిజైన్‌, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ—అన్ని దశల్లోనూ తలెత్తిన తీవ్ర సమస్య అని వివరించారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకదానిపై మరొకటి ఆధారపడిన కాస్కేడ్‌ వ్యవస్థగా పనిచేస్తాయని ఉత్తమ్‌ సభకు వివరించారు. మేడిగడ్డ వద్ద నీటిని నిల్వచేసి అవసరమైన హైడ్రాలిక్‌ హెడ్‌ను సృష్టించిన తరువాతే లక్ష్మీ పంప్‌హౌస్‌ ద్వారా అన్నారానికి ఎత్తిపోసే వీలుంటుందని చెప్పారు. అక్కడి నుంచి సుందిళ్లకు, సుందిళ్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించాల్సి ఉంటుందన్నారు. భద్రతా కారణాలతో బ్యారేజీల గేట్లు మూసి నీటిని నిల్వ చేయలేని పరిస్థితిలో పంపులను ఆన్‌ చేయాలన్న డిమాండ్‌ సాంకేతిక వాస్తవాలను విస్మరించడమేనని స్పష్టం చేశారు.
మూడు బ్యారేజీల భద్రతపై రాజకీయ నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Assembly
Telugu News
Politics