Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కూతుర్ని విసిరేసిన తల్లి.. ప్రాణాలకు తెగించి హీరోలా కాపాడిన ఆటోడ్రైవర్.!. అసలు విషయం ఇదే.!.
Mother throws daughter into well in hyderabad: కూతురిని కన్న తల్లి హుస్సేన్ సాగర్ లోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే ఆ మార్గంలో వెళ్తున్న ఆటో డ్రైవర్ దీన్న గమనించాడు. వెంటనే నీళ్లలోకి దూకి బాలికను కాపాడాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Mother allegedly throws daughter into hussain sagar in hyderabad: అనాదీగా తల్లిని మించిన దైవంలేదని చెప్తారు. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డ కోసం తల్లి ఎలాంటి త్యాగాలు, పోరాటాలు చేయడానికైన వెనుకాడదు. అంతే కాకుండా ఎప్పుడు తన పిల్లల భవిష్యత్ కోసం తాపత్రయ పడుతుంది. కానీ ఇటీవల కొంత మంది తల్లులు చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. తమ వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని బిడ్డలను సైతం హతమారుస్తున్నారు.
ఆర్థిక సమస్యలతో సతమతమై తమ పిల్లలను అమ్మడం, ఎక్కడైన వదిలేయడం లేదా చివరకు చంపడానికి సైతం వెనుకాడటంలేదు. ఇలాంటి విషాదకర ఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లోని ఓల్డ్ బోయిన్‌పల్లి హస్మత్‌పేట ప్రాంతానికి చెందిన షబానా అనే మహిళ గత కొన్నేళ్లుగా తన భర్తకు దూరంగా ఉంటోంది. చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసుకుంటూ తన ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటుుంది.
అయితే.. ఆమె రెండో కుమార్తె రుక్సానా (6) గత కొద్దిరోజులుగా పెద్దపేగు ఇన్‌ఫెక్షన్ సమస్యతో బాధపడుతోంది. ఆమెను ఎన్ని ఆస్పత్రులకు తిప్పిన, చికిత్స అందించిన కూడా లాభంలేకుండా పోయింది.తన బిడ్డపడుతున్న బాధను చూడలేక చివరకు తల్లి షబానా ఒక కఠిన నిర్ణయం తీసుకుంది.
చికిత్స మరింత భారం కావడంతో మనస్తాపానికి గురైన షబానా తన కుమార్తె రుక్సానాను హుస్సేన్‌సాగర్ వద్దకు తీసుకెళ్లింది. అక్కడ ఎవరు గమనించడంలేదని భావించి ఒక్కసారిగా తన కూతుర్ని హుస్సేన్ సాగర్ నీళ్లలోకి విసిరేసింది. ఆ సమయంలో అదృష్టవశాత్తూ అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ ఇది గమనించాడు.
వెంటన పరుగున వెళ్లి నీళ్లలోకి దూకాడు. బాలికను పట్టుకుని పైకి తీసుకొచ్చాడు. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలికకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ బాలిక తల్లికి పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం.