• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్మగ్లింగ్ యత్నం.. విదేశీ కరెన్సీతో దంపతులు అరెస్ట్.. రూ. 1.56 కోట్ల నగదు స్వాధీనం!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్మగ్లింగ్ యత్నం.. విదేశీ కరెన్సీతో దంపతులు అరెస్ట్.. రూ. 1.56 కోట్ల నగదు స్వాధీనం!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ భారీ ఆపరేషన్ చేపట్టి, రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్ వెళ్తున్న ఒక దంపతులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 24, 2026, 08:39 AM IST|Updated: Oct 24, 2026, 09:03 AM IST
joinshare
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్మగ్లింగ్ యత్నం.. విదేశీ కరెన్సీతో దంపతులు అరెస్ట్.. రూ. 1.56 కోట్ల నగదు స్వాధీనం!
Image Credit: shamshabad airport dri raid

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Karnataka: వామ్మో..యూట్యూబ్ చూసి భర్త హత్యకు స్కెచ్..ఇడ్లీలో ఉమ్మెత్త పొడి కల్పి మరీ దారుణం.!.

Karnataka: వామ్మో..యూట్యూబ్ చూసి భర్త హత్యకు స్కెచ్..ఇడ్లీలో ఉమ్మెత్త పొడి కల్పి మరీ దారుణం.!.

2

శని పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం.. ఆదాయం పెరిగే ఛాన్స్!

3

దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!

4

‘రణబాలి’కి ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటిస్తుందా..!

5

తులారాశిలో బుధుడి తిరోగమనం.. అక్టోబర్ 24 నుంచి ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

shamshabad airport dri raid: శంషాబాద్‌లో భారీ కరెన్సీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. ఏయిర్‌ ఏషియా విమానంలో శంషాబాద్ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్ వెళ్తున్న దంపతులను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.1.56 కోట్ల విలువ చేసే కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.1,64,2500 అమెరికన్ డాలర్లు, 3,773 మయన్మార్ కరెన్సీ ఉండగా, వీటి మొత్తం విలువ సుమారు 1.56 కోట్లుగా అంచనా వేశారు. వీరి వద్ద సింగపూర్ దినార్ కూడా లభించింది. క్యాబిన్ బ్యాగేజీని తనిఖీ చేస్తున్న సమయంలోనే ఈ స్మగ్లింగ్ ప్రయత్నం బయటపడింది. వీరు ట్రాలీ బ్యాగ్‌లోని దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో ఈ కరెన్సీని దాచి ఉంచారు.

ఈ దంపతులు ఒకే పిఎన్ఆర్ పై ప్రయాణిస్తున్నారు. మొదట భర్తను పట్టుకున్న తర్వాత భార్యను కూడా గుర్తించారు. ముందస్తు సమాచారంతో మహిళను కూడా అదుపులోకి తీసుకుని, వారి లగేజీని తనిఖీ చేయగా ఈ భారీ స్మగ్లింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విదేశీ కరెన్సీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో, వారిని అదుపులోకి తీసుకుని రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని సీజ్ చేశారు. అక్రమంగా తరలించడానికి ఉపయోగించిన ట్రాలీ బ్యాగులను కూడా కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

 

Hyderabad, Telangana | Officers of DRI HZU intercepted one male Indian passenger who was scheduled to depart from RGIA, Hyderabad, to Kuala Lumpur, Malaysia, by AirAsia Flight AK-68 on 22.10.2026. During examination of his cabin baggage, foreign currency comprising USD 66,600, MYR 3,773 and SGD 2, collectively valued at approximately Rs 63.62 lakh, was recovered concealed inside a black plastic cover kept among clothes in his trolley bag. During preliminary questioning, it was revealed that another female passenger was also travelling with him on the same flight on a different PNR. Immediately, surveillance was mounted, and the said female passenger was identified and intercepted. Examination of her cabin baggage resulted in the recovery of USD 97,600, valued at approximately Rs 91.94 lakh, similarly concealed inside a black plastic cover among clothes in her trolley bag. Both passengers failed to produce documents supporting the lawful procurement and carriage of the foreign currency. Accordingly, the entire foreign currency, valued at approximately Rs 1.56 crore, along with the trolley bags used for concealment, was seized under the provisions of the Customs Act, 1962. Both the passengers were arrested. Further investigation is in progress: DRI Hyderabad (Source: DRI Hyderabad)

— ANI (@ANI) October 24, 2026

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI), హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ ఈ భారీ ఆపరేషన్‌ చేపట్టింది. 22వ తేదీ ఈ ఘటన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. డీఆర్‌ఐ పక్కా సమాచారంతో ఈ భారీ కరెన్సీ స్మగ్లింగ్‌ యత్నాన్ని భగ్నం చేసింది. ఏయిర్‌ ఏషియా విమానం మలేషియాలోని కౌలాలంపూర్ బయలు దేరే ముందే సదరు దంపతులను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా కరెన్సీకి సంబంధించిన వివరాలను కూడా వారు సమర్పించలేకపోయారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొదటగా భర్తను అదుపులోకి తీసుకున్న అధికారులు వెంటనే అతని పీఎన్‌ఆర్‌ నెంబర్‌ చెక్‌ చేయగా మహిళ కూడా అదే పీఎన్‌ఆర్‌ నెంబర్‌పై ప్రయాణం చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. దీంతో ఆమె లగ్జేజీని కూడా చెక్‌ చేయగా తన వద్ద కూడా ఈ స్మగ్లింగ్‌ కరెన్సీ గుర్తించారు. దీంతో ఇద్దరు దంపతులను కూడా అదుపులోకి తీసుకుని, అరెస్ట్‌ చేశారు.

రూ. 5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ..
శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్టోబర్‌ 21వ తేదీ కూడా ఇలాంటి స్మగ్లింగ్‌ యత్నాన్ని కూడా డీఆర్‌ఐ భగ్నం చేసింది. ఐదుగురిని అరెస్ట్‌ చేసింది. వీరి వద్ద బంగ్లాదేశ్‌ నుంచి తీసుకువస్తున్న బంగరాం కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ తీసుకు వస్తున్న సమయంలో పట్టుకున్నారు. 3.1 కేజీల బంగారం విలువ రూ.5.84 కోట్లు భారీ ఆపరేషన్‌ చేపట్టి సీజ్‌ చేశారు. ఇక డీఆర్‌ఐ అధికారుల సమాచారం మేరకు హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌, విజయవాడ రిజియనల్‌ యూనిట్‌ సమన్వయంతో ఇంటెలిజెన్స్‌ రిపోర్టు ఆధారంగా ఈ స్మగ్లింగ్‌ భగ్నం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Telugu News
Hyderabad
Telangana News