• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /Jagtial: జగిత్యాల మూడేళ్ల బాలుడి దత్తత వివాదంలో శుభవార్త.. కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆనందంలో తల్లిదండ్రులు..

Jagtial: జగిత్యాల మూడేళ్ల బాలుడి దత్తత వివాదంలో శుభవార్త.. కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆనందంలో తల్లిదండ్రులు..

Jagtial boy Adoptation case: మూడేళ్ల బాలుడి దత్తత వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక కలెక్టర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. బాలుడి తల్లిదండ్రులతో మాట్టాడారు. పండగకు ముందు కలెక్టర్ శుభవార్త చెప్పడంతో స్థానికులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 07, 2026, 08:51 AM IST|Updated: Nov 07, 2026, 09:02 AM IST
joinshare
Jagtial: జగిత్యాల మూడేళ్ల బాలుడి దత్తత వివాదంలో శుభవార్త.. కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆనందంలో తల్లిదండ్రులు..
Image Credit: Jagtial child adoptation case

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

2

AP MPTC ZPTC Results: ఏపీలో కౌంటింగ్ వేళ హైటెన్షన్.. పలుచోట్ల వాహనాల దగ్దం.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్..

3

తమిళ సీఎం విజయ్ దీపావళి ధమాకా.. రూ. 100కే 10 రకాల కూరగాయలు..!

4

గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!

5

Surekha Vani Video: 49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన సురేఖ వాణి.. టీనేజ్ కుర్రాడితో రొమాన్స్.?. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Collector Withdrawal his writ petition over Jagtial child adoption case: జగిత్యాలలో మూడేళ్ల బాలుడి దత్తత వివాదం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. కలెక్టర్ సత్య ప్రసాద్ తాజా నిర్ణయంతో ఈ వివాదంకు ఫుల్ స్టాప్ పడింది. జగిత్యాలలోని జంబిగద్దెకు చెందిన సరిత, శ్రీనివాస్ గౌడ్ దంపతులు కొన్నేళ్ల క్రితం పిల్లలు లేకపొవడంతో నెల పసికందును దత్తత తీసున్నారు. అప్పటి నుంచి ఆ బాలుడ్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అతనే తమ జీవితంలా బతుకున్నారు. ఈ క్రమంలో బాలుడి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదం తలెత్తడంతో దత్తత చట్టబద్దంగా తీసుకోలేదని చైల్డ్ వెల్ ఫర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడ్ని సెప్టెంబర్ 16న శిశు సంక్షేమ శాఖ అధికారులు వచ్చి తీసుకెళ్లారు. 

ఆ తర్వాత బాలుడి తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లడంతో మరల తల్లిదండ్రులకు అప్పగించాలని  హైకోర్టు  అక్టోబరు 16న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పరిణామం తర్వాత కూడా అధికారులు బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించలేదు. ఈ క్రమంలో బాలుడిని చూసేందుకు వెళ్లినప్పుడు శిశు సంక్షేమ కేంద్రంలో బాలుడు హత్తుకుని తనను తీసుకెళ్లమని ఏడ్వడం వీడియో వైరల్ కావడంతో స్థానిక అధికారులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

 మరల కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టులో దీనిపై రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం తలెత్తింది. తాజాగా.. కలెక్టర్ సత్య ప్రసాద్ తన రిట్ పిటిషన్ ను ఉప సంహరించుకుంటున్నట్లు మూడేళ్ల బాలుడి తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడారు. దత్తతను చట్టబద్దంగా నిర్వహించుకొవాలని సూచించారు. బాలుడి దత్తత తల్లిదండ్రులకు కలెక్టర్ ఆఫీస్ కు రప్పించి బాలుడికి, వారి తల్లిండ్రులకు బట్టలు పెట్టారు. 

రిజిస్ట్రేషన్  ఆఫీస్ లో చట్ట బద్దంగా దత్తత విధానం పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ పరిణామంతో దీపావళికి ముందు కలెక్టర్ తమకు శుభవార్త చెప్పారని, ఇదే తమకు దీపావళికి కానుక అంటూ దత్తత తల్లిదండ్రులు భావొద్వేగంకు గురయ్యారు. ఈ ఘటనతో మూడేళ్ల బాలుడి దత్తత వివాదం పరిష్కారం కావడంతో స్థానికులు, నెటిజన్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Karimnagar
Telangana News
Telugu News