SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పగటిపూట వీధి దీపాలు ఆన్‌లోనే.. జగిత్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు!

Jagtial Municipal Negligence: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెంటును జాగ్రత్తగా వాడుకోవాలని పిలుపునిస్తే.. జగిత్యాలలో మాత్రం అధికారులు చేతులెత్తేసి ఉదయం పూట వీధి స్తంభాలకు కరెంటు బల్బులు ఆన్ చేసి వృధా చేస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 03:38 PM IST | Updated: Oct 25, 2026, 03:40 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Jagtial Municipal Negligence: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ పొదుపును పాటించాలని.. పగటిపూట అనవసరంగా ఒక్క ట్యూబ్లైట్ కూడా వెలగకూడదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ కార్యాలయాల్లో అనవసరంగా ఏసీలు నడవకూడదని.. ప్రతి యూనిట్ కరెంటును జాగ్రత్తగా కాపాడుకోవాలని.. పాలన యంత్రాంగానికి గట్టిగ పిలుపునిచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం సీఎం ఆదేశాలను నీరుగారిస్తూ వస్తోంది. జగిత్యాల పట్టణంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్ వృధాకు నిలువెత్తు సాక్షంగా నిలుస్తూ వస్తున్నాయి.

జగిత్యాల పట్టణంలోని ప్రధాన రద్దీప్రాంతమైన రోడ్లలో ఆదివారం విచిత్ర పరిస్థితి నెలకొంటూ వచ్చింది. సూర్యకాంతి నిండుగా ఉన్నప్పటికీ.. ఉదయం 10 గంటల సమయం దాటిన రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వీధి దీపాలు ఇంకా వెలుగుతోనే ఉన్నాయట.. రాత్రి సమయంలో ఆన్ చేసిన స్విచ్ లను తెల్లవారుగానే ఆపేయాల్సిన మున్సిపల్ సిబ్బంది.. తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో గంటల తరబడి విలువైన విద్యుత్ వృధా అయిపోయింది..

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోరత రాకుండా ఉండేందుకు.. ఖజానా పై భారం తగ్గించేందుకు ప్రజలకు, ఉద్యోగులకు విద్యుత్ పొదుపు పాఠాలను చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో ఉన్న మున్సిపల్ సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. సీఎం ఆదేశాలు కేవలం ప్రకటనలకే పరిమితమా? అధికారులకు ఎలాంటి జవాబుదారితనం లేదా? అని స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు ప్రశ్నిస్తూ వస్తున్నారు. సమయానికి లైట్లు ఆఫ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సిబ్బందిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు..

పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు.. వీధుల్లో సమయానికి లైట్లు ఆన్, ఆఫ్ చేయడానికి ప్రత్యేకంగా ఆటోమేటిక్ టైమర్లని వ్యవస్థ ఏర్పాటు చేయాలని.. లేదా బాధ్యతయుతమైన సిబ్బందిని నియమించాలని పట్టణవాసులు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రజాధనంతో పాటు విలువైన విద్యుత్ ఇలా పగటిపుత వృధా కాకుండా మున్సిపల్ ఉన్నత అధికారులు తక్షణమే దృష్టిసారించి.. బాధ్యులపై శాఖ పర్యమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES